T20 World Cup IND vs ENG : టీమిండియాకు సెమీస్ ‘గండం’.. గట్టెక్కేదెలా?

T20 World Cup IND vs ENG : గత ప్రపంచకప్ లో పాకిస్తాన్ చేతిలో గ్రూప్ స్టేజీలోనే వైదొలిగిన టీమిండియా ఘోర అవమానాలు ఎదుర్కొంది. నాటి భారత్ జట్టు పరిస్థితే నేడు దక్షిణాఫ్రికాకు ఎదురైంది. పాకిస్తాన్ కు అదృష్టం కలిసివచ్చి సెమీస్ రేసులోకి వచ్చింది. ఇప్పుడు గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్, గ్రూప్ 2 నుంచి ఇండియా, పాకిస్తాన్ జట్లు సెమీస్ లో నిలిచాయి. గ్రూప్ 2 టాప్ గా నిలిచిన టీమిండియా.. గ్రూప్ […]

Written By: NARESH, Updated On : November 8, 2022 10:17 am
Follow us on

T20 World Cup IND vs ENG : గత ప్రపంచకప్ లో పాకిస్తాన్ చేతిలో గ్రూప్ స్టేజీలోనే వైదొలిగిన టీమిండియా ఘోర అవమానాలు ఎదుర్కొంది. నాటి భారత్ జట్టు పరిస్థితే నేడు దక్షిణాఫ్రికాకు ఎదురైంది. పాకిస్తాన్ కు అదృష్టం కలిసివచ్చి సెమీస్ రేసులోకి వచ్చింది. ఇప్పుడు గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్, గ్రూప్ 2 నుంచి ఇండియా, పాకిస్తాన్ జట్లు సెమీస్ లో నిలిచాయి.

గ్రూప్ 2 టాప్ గా నిలిచిన టీమిండియా.. గ్రూప్ 1లో రెండోస్తానంలో నిలిచిన ఇంగ్లండ్ ను సెమీస్ లో ఎదుర్కోబోతోంది. ఇక గ్రూప్ 1 టాప్ న్యూజిలాండ్.. మన గ్రూప్ 2 రెండోస్థానంలో ఉన్న పాకిస్తాన్ ను ఢీకొట్టబోతోంది. తొలి సెమీస్ లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ పోరు సాగనుంది. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాక్ జట్టు నిజంగా 100శాతం పోరాడితే మాత్రం న్యూజిలాండ్ ను ఈజీగా ఓడించవచ్చు. కానీ వారి ఆట ఎప్పుడూ ప్రశ్నార్థకమే.. మంచిగా ఆడితే ఏ జట్టునైనా ఓడించే సత్తా ఉన్నా ఒత్తిడికి గురై చిత్తవుతుంటారు. అందుకే తొలి సెమీస్ రేసు ఆసక్తి రేపుతోంది.

ఇక టోర్నీలో టీమిండియా అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నప్పటికీ మిడిల్ ఆర్డర్ కలవరపెడుతోంది. ఆడిలైడ్ లో గురువారం ఇంగ్లండ్ తో సెమీస్ కు ముందు కీపర్ కం బ్యాట్స్ మెన్ స్థానం ప్రశ్నార్థకంగా ఉంది. దినేష్ కార్తీక్ ను ఆడించాలా? పంత్ ను కొనసాగించాలా? అన్నది తేలడం లేదు. ఇక హార్ధిక్ పాండ్యా కూడా బ్యాట్ తో రాణించడం లేదు. బలమైన ఇంగ్లండ్ పై గెలవాలంటే అందరూ అన్ని రంగాల్లో రాణించాలి. ముఖ్యంగా బౌలింగ్, బ్యాటింగ్ లో ఇంగ్లీష్ టీం బలంగా ఉంది. టీమిండియాకు బలమైన పోటీదారుగా ఉంది. బాగా ఆడితే తప్ప ఇంగ్లండ్ ను ఓడించడం సాధ్యం కాదు. ఆ టీంలో 8వ నంబర్ వరకూ బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆల్ రౌండర్లు ఉన్నారు. ఒక్కరు నిలబడ్డ పరుగుల వర్షం ఖాయం. అందుకే ఇంగ్లండ్ ఈ టీ20 వరల్డ్ కప్ లో ప్రమాదకర జట్టుగా ఉంది.

ఇక గడిచిన 4 ఐసీసీ ప్రపంచకప్ సెమీఫైనల్స్ లో టీమిండియా ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. కప్ కొట్టింది లేదు. 2019 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఇక 2017 చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ పై సెమీస్ లో గెలిచింది. 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో ఓడింది. 2015 ప్రపంచకప్ సెమీఫైనల్ లోనూ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

గడిచిన కొన్నేళ్లుగా కప్ కొట్టని టీమిండియా సెమీఫైనల్, ఫైనల్ గండాన్ని దాటడం లేదు. ఇంగ్లండ్ తో సెమీస్ కూడా భారత్ కు గట్టి సవాల్ అని చెప్పాలి. ఇంగ్లండ్ ను తక్కువ అంచనావేస్తే దెబ్బైపోతారు. ఆ జట్టులో భారీ హిట్టర్లు ఉన్నారు. అటు బౌలింగ్ లో.. ఇటు బ్యాటింగ్ లో టీమిండియా అద్భుతంగా రాణిస్తేనే విజయం సాధించగలరు. లేదంటే మరోసారి నిరాశ తప్పదు. సో ఆల్ ది బెస్ట్ టీమిండియా..