https://oktelugu.com/

T20 Womens world cup 2024 : ప్రమాదంలో సెమీస్ అవకాశాలు.. టీమిండియా అమ్మాయిలు ఆస్ట్రేలియా చేతిలో ఎలాగైనా గెలవాలి.. అందుకు ఈ గేమ్ ప్లాన్ అమలు చేయాలి..

తొలి లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడం.. టీమిండియా కు అవాంతరంగా మారింది. శ్రీలంక, పాకిస్తాన్ పై గెలిచినప్పటికీ టీమిండియా కు సెమీస్ కు చేరే అవకాశాలు అంతగా లేవు. టీమిండియా సెమీస్ వెళ్లాలంటే కచ్చితంగా ఆశ్చర్యపై గెలవాల్సిందే.

Written By: NARESH, Updated On : October 12, 2024 4:48 pm

T20 Womens world cup 2024 : Team India girls must win at the hands of Australia

Follow us on

T20 Womens world cup 2024 ఆదివారం రాత్రి జరిగే మ్యాచ్లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా తో తలపడుతుంది. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం భారత జట్టు సెమిస్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. పాకిస్తాన్ చెట్టుపై ఆరుగంటల తేడాతో గెలిచినప్పటికీ.. శ్రీలంకపై 82 పరుగుల తేడాతో విజేత గా నిలిచినప్పటికీ.. సెమీస్ కు మార్గం సుగమం కాలేదు. గత రెండు మ్యాచ్ లలో గెలిచిన తీరుగానే.. ఆదివారం జరిగే మ్యాచ్ లోనూ ఆస్ట్రేలియాపై గెలవాలని టీమ్ ఇండియా చూస్తోంది. ఆస్ట్రేలియాపై గెలవాలంటే టీమిండియా పూర్తిస్థాయిలో ప్రదర్శన చేయాల్సి ఉంది.. టి20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాతో ఆడిన ఐదు మ్యాచ్ లలో భారత్ ఓటమిపాలైంది. అయితే ఈసారి ఆ అపప్రదను భారత్ సవరించుకోవాల్సిన అవకాశం ఉంది.

అలా అయితేనే సెమీస్ వెళ్తుంది

గ్రూప్ – ఏ లో టీమిండియా రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. టాప్ -2 లో నిలిచిన జట్లు నేరుగా సెమీస్ వెళ్ళిపోతాయి. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన టీమిండియా.. రెండిట్లో గెలిచింది. టీమిండియా ఖాతాలో ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా చేతిలో ఆరు పాయింట్లు ఉన్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా పై భారత్ గెలిస్తే పాయింట్లు సంఖ్య 6 కు పెరుగుతుంది మరోవైపు శ్రీలంక, పాకిస్తాన్ జట్లతో ఆడాల్సిన రెండు మ్యాచ్ లను న్యూజిలాండ్ గెలిస్తే ఆ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉన్న రెండు జట్లు సెమిస్ వెళ్ళిపోతాయి. ఒకవేళ ఆ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ భారత గట్టుకు అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు న్యూజిలాండ్ తన చివరి రెండు మ్యాచ్ లలో విజయం సాధించొద్దు. లేదా ఒక దాంట్లో గెలిచినా.. మరో దాంట్లో చిత్తుగా ఓడిపోవాలి. రన్ రేట్ విషయంలో భారత్ కంటే తక్కువ స్థానంలో ఉండాలి. ఆ తర్వాత ఇతర జట్లు ఆడే మ్యాచ్ ఫలితాల ఆధారంగా భారత జట్టు సెమిస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రేలియా ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి.. మూడూ గెలిచింది. ఆ జట్టు +2.786 నెట్ రన్ రేట్ ను కలిగి ఉంది.. భారత్ 0.576 నెట్ రన్ రేట్ కలిగి ఉంది. న్యూజిలాండ్ -0.050 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది.. పాకిస్తాన్ -0.488 నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలో ఉంది. శ్రీలంక -2.564 నెట్ రన్ రేట్ తో ఐదవ స్థానంలో ఉంది. అయితే ఇప్పటికే ఈ టోర్నీ నుంచి శ్రీలంక దాదాపు నిష్క్రమించినట్టే. పాకిస్తాన్ వారి స్థితి కూడా అంతే..

సత్తా చాటాల్సిన అవసరం ఉంది

న్యూజిలాండ్ జట్టు పై ఆడిన తొలి మ్యాచ్లో భారత ఓపెనర్లు తేలిపోయారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ భారత ఓపెనర్లు సత్తా చాట లేకపోయారు. శ్రీలంక జట్టు జరిగిన మ్యాచ్లో మాత్రం టచ్లోకి వచ్చారు. శ్రీలంక మాదిరిగానే ఆస్ట్రేలియా పై కూడా భారత ఆటగాళ్లు సమష్టి ప్రదర్శన చూపితే విజయం పెద్ద కష్టం కాదు. అయితే ఆస్ట్రేలియా జట్టును మైండ్ గేమ్ తోనే ఓడించాల్సి ఉంటుంది..