Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ హోరాహోరిగా కొనసాగుతోంది. సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్లో బరోడా జట్టు అద్భుతాన్ని సృష్టించింది. ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా 349 రన్స్ చేసింది. 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఈ ఘనతను అందుకుంది. టి20 క్రికెట్ చరిత్రలోనే ఇది హైయెస్ట్ స్కోర్. బరోడా ఉజ్జయిని జట్టులో భాను పనియా 134*, అభిమన్యు 53, శివాలిక్ శర్మ 55), విష్ణు 50 రన్స్ చేసి ఆకట్టుకున్నారు. బరోడా జట్టు బ్యాటర్లు ఏకంగా ఈ మ్యాచ్లో 37 సిక్స్ లు కొట్టారు . ఈ మ్యాచ్ లో హైయెస్ట్ సిక్సర్లు కొట్టిన బ్యాటర్లుగా బరోడా ఆటగాళ్లు రికార్డు సృష్టించారు. సిక్కిం బౌలర్లలో తమంగ్, రోషన్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. తరుణ్ ఒక వికెట్ సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిక్కిం నిర్ణీత 20 ఓవర్లు ఆడి, ఏడు వికెట్ల కోల్పోయి 86 రన్స్ మాత్రమే చేసింది.
బరోడా బౌలర్ల ఆధిపత్యం
బ్యాటింగ్ లో అదరగొట్టిన బరోడా.. బౌలింగ్ లోనూ అదే జోరు కొనసాగించింది. బౌలర్లు అంతకుమించి అనేలాగా బౌలింగ్ వేయడంతో సిక్కిం బ్యాటర్లు తేలిపోయారు. బరోడా బౌలర్లు నినద్, మహేష్ చేరి రెండు వికెట్లు పడగొట్టారు. క్రునాల్, అతిత్, అభిమన్యు చెరో వికెట్ తీశారు. సిక్కిం బౌలర్ రోషన్ ఈ మ్యాచ్ ద్వారా అత్యంత దారుణమైన రికార్డు నమోదు చేశాడు. టి20 క్రికెట్లో హైయెస్ట్ రన్స్ ఇచ్చిన ఆటగాడిగా దారుణమైన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. ఇతడు నాలుగు ఓవర్లు వేసి 81 పరుగులు సమర్పించుకున్నాడు. ఇదే క్రమంలో అతడు మోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. 2024 ఐపీఎల్లో ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా గుజరాత్ తరఫున బౌలింగ్ వేసిన మోహిత్ శర్మ.. నాలుగో ఓవర్లలో 73 పరుగులు సమర్పించుకున్నాడు.
టి20లలో హైయెస్ట్ స్కోర్ లు ఇవే.
2024 ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్లో బరోడా, సిక్కిం తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బరోడా ఐదు వికెట్ల నష్టానికి 349 రన్స్ చేసింది.
2024లో నైరోబి వేదికగా జింబాబ్వే, గాంబియా మధ్య జరిగిన మ్యాచ్ లో.. జింబాబ్వే జట్టు సత్తా చాటింది. జింబాబ్వే నాలుగు వికెట్ల నష్టానికి 344 రన్స్ చేసింది.
2023లో హాంగౌజ్ వేదికగా జరిగిన మ్యాచ్లో నేపాల్ మంగోలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో నేపాల్ మూడు వికెట్ల నష్టానికి 314 రన్స్ చేసింది.
2024 హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్, భారత్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ 297/6 రన్స్ చేసింది.
2024 బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల తలపడ్డాయి. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 287/3 రన్స్ చేసింది.
2024 లో నైరోబి వేదికగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వే, సెయ్ చెల్లెస్ జట్లు తలపడ్డాయి. జింబాబ్వే జట్టు 286/6 రన్స్ చేసింది.
2024 జోహాన్నెస్ బర్గ్ వేదికగా భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ ఒక వికెట్ నష్టపోయి 283 రన్స్ చేసింది.