Surya Kumar Yadav: హైదరాబాద్ లోని ఉప్లల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి అభిమానుల కళ్లలో ఆనందం నింపింది. కానీ మన లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. జట్టులో స్థానం కోసం చాలా మంది పోటీలో ఉండటంతో టీమిండియాలో చోటు కోసం అందరిలో పోటీ ఏర్పడింది. దీంతో జ్వరం వచ్చినా ఆటకు దూరం కాకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఆసీస్ తో జరిగిన మూడో వన్డేలో సూర్యకుమార్ యాదవ్ కు జ్వరం ఉన్నా మ్యాచ్ ఆడాడు. తన బ్యాట్ కు పనిచెప్పి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.

మ్యాచ్ అనంతరం అడిగిన ప్రశ్నలకు సూర్యకుమార్ బదులిస్తూ ఈ మ్యాచ్ తనకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. అందుకే బెంచ్ కు పరిమితం కాకుండా ఆటకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే జట్టులో పోటీ నెలకొంది. ఫామ్ లో ఉన్న ఆటగాడికే ప్రాధాన్యత ఇస్తారు. లేదంటే పక్కన పెట్టేస్తారు. అందుకే సర్వశక్తులు ఒడ్డి ఆడా. మంచి ఫలితం వచ్చింది. దీంతో టీమిండియా విజయం దక్కించుకుంది. తాను మ్యాచ్ ఆడేందుకు నిర్ణయించుకున్నానని చెప్పడంతో డాక్టర్ కూడా సూర్యకుమార్ కు అడ్డు చెప్పలేదు.
కచ్చితంగా నిలిచి గెలవాల్సిన మ్యాచ్ లో ఫామ్ లోకి రావడంతో సూర్యకుమార్ కు ప్లస్ అయింది. గ్రౌండ్ లో అడుగు పెట్టాక జ్వరం కూడా తగ్గినట్లు కావడంతో మ్యాచ్ లో పరుగులు వేగంగా చేయగలిగానని సూర్యకుమార్ వెల్లడించాడు. అనారోగ్య కారణాలతో బెంచ్ మీద కూర్చుంటే భవిష్యత్ అంధకారమే. అందుకే బెంచ్ కు పరిమితం కాకుండా ఉండేందుకు నిర్ణయించుకుని వెళ్లానని చెప్పాడు. సూర్యకుమార్ చేసిన పరుగులతోనే ఆస్ట్రేలియా ఓటమి అంచుకు వెళ్లింది. ఫలితంగా అతడికి మంచి పేరు వచ్చింది.

దీంతో ఆటగాళ్ల ఫామ్ మీదే మ్యాచ్ గెలుపు ఆధారపడి ఉంటోంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో పరుగులు చేయడంలో ఉత్సాహం చూపించాడు. తనదైన శైలిలో బ్యాట్ తో పరుగులు రాబట్టాడు. భావోద్వేగాల మధ్య కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు లైఫ్ ఇచ్చిన మ్యాచ్ తో అతడి స్థానం ఇక ఖాయమనే ఉద్దేశంతో ఉన్నాడు. జట్టులో స్థానం కోసం పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆటగాళ్ల ఫామ్ ను లెక్కలోకి తీసుకోనున్నారు.