Strange Animal: ప్రకృతి మనకు ప్రసాదించిన వాటిని మనం నాశనం చేసుకుంటున్నాం. ఇప్పటికే కొండలను పిండి చేస్తున్నాం. ఇతర దేశాల్లో కూడా కొండలు ఉన్నాయి. కానీ వాటిని వారు భవిష్యత్ తరాల కోసం కాపాడుకుంటున్నారు. మనం మన స్వార్థం కోసం ఉన్న వాటిని సర్వనాశనం చేస్తున్నాం. ఫలితంగా అడవులు అంతరిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు భయపెడుతున్నాయి. ఇవన్నీ ప్రకృతిని మనం అంతం చేయడంతో జరిగే దుష్ఫరిణామాలే. కానీ మనకు అవేమీ అక్కర్లేదు. మనకు వచ్చే ఆదాయం కావాలి. దాంతో కోట్లు సంపాదించి భవిష్యత్ తరాలకు ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నాం. అడవులను కూడా విచ్చలవిడిగా నరికేస్తున్నాం. దీంతో ప్రకృతి ప్రకోపిస్తోంది. ఇటీవల ఆఫ్రికా దేశాల్లో కరువు తాండవిస్తుంటే పాకిస్తాన్ లో వరదలు వచ్చాయి. ఇవి ప్రకృతి విరుద్ధమైన పనులతో వచ్చే ఫలితాలే.
అడవిలో ఉండే జంతువులను కూడా అంతరించేలా చేస్తున్నాం. పులులు, సింహాలు కనిపించడమే లేదు. అడవికి రారాజుగా పిలిచే సింహాల సంతతి కనుమరుగవుతోంది. ఇటీవల ఏలూరు జిల్లా ఏజెన్సీలో అడవి అలుగుల సంచారం కనిపిస్తోంది. అయితే వీటికి చైనాలో మంచి డిమాండ్ ఉంది. అక్కడ దీన్ని మందుల తయారీలో ఉపయోగిస్తారట. దీంతో వీటిని విక్రయిస్తే రూ. 20 లక్షల వరకు ధర పలుకుతుందట. దీంతో వాటిని అక్రమంగా రవాణా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అడవి అలుగులు ఇక్కడ ఇరవై వరకు ఉన్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. దీంతో వాటిని పట్టుకుని విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పలువురు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అలుగుల్లో నాలుగు రకాలు ఉన్నాయి. చైనీస్ పాంగోలిన్, ఏషియా పాంగోలిన్, సుండా పాంగోలిన్, పాతమాన్ మాంగోలిన్ అని పిలుస్తుంటారు. వీటి మూతి కూడా ముంగీస మూతిలాగా ఉంటుంది. నాలుగు కాళ్లు ఉంటాయి. ఇది చీమలు, పురుగులు ఆహారంగా తీసుకుంటుంది. ఇరవై ఏళ్ల వరకు జీవిస్తుంది. ఇవి కూడా కోతుల వలె తమ పిల్లలను వీపు మీద ఎక్కించుకుని తిరుగుతాయి. దట్టమైన అడవులు, అధిక వర్షాలు పడే ప్రాంతాలు, ఎడారుల్లో జీవనం సాగిస్తుంటాయి. తొలిసారిగా వీటిని 1821లో కనుగొన్నారు. దీంతో వీటిని పట్టుకుని అమ్ముకుని డబ్బు సంపాదించాలని కొందరు వేటగాళ్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వన్యప్రాణుల చట్టం ప్రకారం వీటిని పట్టుకుంటే చర్యలు తప్పవని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
అలుగు పగటి పూట కంటే రాత్రుల్లో ఎక్కువగా సంచరిస్తుంది. తన ఆహార సేకరణకు రాత్రి పూటే బయలుదేరుతుంది. ఏదైనా చప్పుడు అయితే వెంటనే ముడుచుకుపోతుంది. దాని వీపు పై ఉండే పెరుసులు లాంటివి పదునైన కత్తిలా ఉంటాయి. అవసరమైతే పోరాటం కూడా చేస్తుంది. అందుకే వీటికి అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటిని పట్టుకోవాలని చూస్తున్నారు. అలుగును మందుల తయారీలో వినియోగించడంతో దానికి డిమాండ్ ఎక్కువైందని తెలుస్తోంది.
వన్యప్రాణుల సంరక్షణకు అటవీ అధికారులు కట్టుబడి ఉన్నారు. దీంతో ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అభయారణ్యాల్లో జంతువుల మనుగడకు విఘాతం కలిగిస్తే అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తే శిక్షార్హులవుతారు. అలుగును వేటాడితే ఏడేళ్ల జైలుతోపాటు రూ. 5 లక్షల జరిమానా కూడా విధిస్తారు. అందుకే వేటగాళ్లు వేటాడకుండా ఉండటమే మంచిది. లేదంటే శిక్షార్హులై జైల్లో మగ్గాల్సి వస్తోంది.