https://oktelugu.com/

Ranji Trophy: మిడిల్ స్టంప్.. అలా గాల్లో ఎగిరిపోయింది.. పాపం సూరీడు షాక్ కు గురయ్యాడు! వీడియో వైరల్

టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఆట తీరు ఏమాత్రం మారడం లేదు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.. ఆ సిరీస్లో సూర్య కుమార్ యాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. అయితే అతడు రంజి ట్రోఫీలో 2024-25 లో అదే తీరు కొనసాగిస్తున్నాడు.

Written By: , Updated On : February 8, 2025 / 08:29 PM IST
Suryakumar Yadav was clean bowled

Suryakumar Yadav was clean bowled

Follow us on

Ranji Trophy:  కోల్ కతా వేదికగా ప్రారంభమైన రంజి క్వార్టర్ ఫైనల్ లో సూర్య కుమార్ యాదవ్ 5 బంతులు ఎదుర్కొని.. రెండు బౌండరీల సహాయంతో 9 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హర్యానా పేస్ బౌలర్ సుమిత్ కుమార్ అద్భుతమైన బంతి వేయడంతో సూర్య కుమార్ యాదవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. సుమిత్ కుమార్ వేసిన ఎనిమిదో ఓవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమిత్ కుమార్ ఇన్ స్వింగర్ బంతిని వేయడంతో.. దానిని సూర్యకుమార్ యాదవ్ అంచనా వేయడంలో విఫలమయ్యాడు. ఆ బంతిని మిడ్ వికెట్ మీదుగా ఆడటంలో సూర్య కుమార్ యాదవ్ పట్టు కోల్పోయాడు. దానికి తగ్గట్టుగా మూల్యం చెల్లించుకున్నాడు. సుమిత్ వేసిన బంతి అద్భుతంగా టర్న్ అయింది.. సూర్య కుమార్ యాదవ్ బ్యాట్, ప్యాడ్ గ్యాప్ నుంచి దూసుకు వెళ్ళింది…మిడిల్ స్టంప్ ను అమాంతం లేపేసింది.. సుమిత్ వేసిన బంతివేగానికి మిడిల్ స్టంప్ అలా గాల్లోకి ఎగిరింది. ఈ అద్భుతమైన బంతికి సూర్య కుమార్ యాదవ్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ముంబై జట్టుకు కష్టాలు

సూర్య కుమార్ యాదవ్ తో పాటు టాప్ ఆర్డర్ కూడా దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే(0), ఆకాష్ ఆనంద్ (10), మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు సిద్దేశ్ లాండ్(4) ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు. దీంతో 25 పరుగులకే ముంబై జట్టు నాలుగు వికెట్లు నష్టపోయింది.. ఈ దశలో శివమ్ దూబే(28), కెప్టెన్ అజింక్యా రహానే (31) ముంబై ని ఆదుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఈ దశలో శివమ్ దూబే అజిత్ చాహల్ బోకు లో అవుట్ అయ్యాడు. దీంతో ఐదో వికెట్ కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కొంత సమయానికి అజింక్యా రహానే అన్షుల్ కాంబోజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.. దీంతో ముంబై జట్టు 94 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది..ఈ దశలో శార్దుల్ ఠాకూర్ (6*), షామ్స్ ములానీ(12*) క్రీజ్ లో ఉన్నారు. హర్యానా బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. సుమిత్ కుమార్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అజిత్ చాహల్ ఒక వికెట్ సొంతం చేసుకున్నాడు.

ఇటీవల కాలంలో దారుణమైన ఆట తీరుతో విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్.. రంజీ లోనూ సరిగా ఆడక పోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు t20 మ్యాచ్ల సిరీస్ లో కుమార్ యాదవ్ 0, 12, 14, 0, 2 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఐదు ఇన్నింగ్స్ లలో సూర్య కుమార్ యాదవ్ ఒకే తీరుగా అవుట్ అయ్యాడు. విభిన్నంగా ఆడే సూర్యను ఇంగ్లాండ్ బౌలర్లు స్లో బంతులు వేసి ఔట్ చేశారు. ఇప్పుడు రంజి ట్రోఫీ లోనూ సూర్య విఫలం కావడం పట్ల నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ” ఇదే అటా? ఇదీ ఆటా? ఇలా ఎన్ని సంవత్సరాలు? ఇంత దారుణంగా ఆడితే ఎలా? అవకాశాలు వస్తున్నా సద్వినియోగ చేసుకోకపోతే ఎలా?” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.