Shobhitha Dhulipalla : అక్కినేని నాగార్జున నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగ చైతన్య, తన తండ్రి లాగానే ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఒకప్పుడు లవ్ స్టోరీస్ అంటే మనకి పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చేవాడు. కానీ నేటి తరం హీరోలలో లవ్ స్టోరీస్ చేయగల హీరో ఎవరు అని అడిగితే అందరూ నాగచైతన్య పేరు చెప్తారు. ‘ఏ మాయ చేసావే’, ‘100 % లవ్’, ‘ఒక లైలా కోసం’, ‘ప్రేమమ్’, ‘మజిలీ’, ‘లవ్ స్టోరీ’ ఇలా ఒక్కటా రెండా ఎన్నో అద్భుతమైన లవ్ స్టోరీస్ ని ఆయన మన టాలీవుడ్ ఆడియన్స్ కి అందించాడు. ఇప్పుడు రీసెంట్ గా ‘తండేల్’ చిత్రం ద్వారా మరో లవ్ స్టోరీ తో మన ముందుకొచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఇలా లవ్ స్టోరీస్ తో యూత్ ఆడియన్స్ కి దగ్గరైన నాగ చైతన్య మధ్యలో కొన్ని మాస్ మూవీస్ చేసాడు.
మాస్ ఆడియన్స్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే నాగ చైతన్య నటించిన మాస్ సినిమాలలో, ‘బెజవాడ’ చిత్రం అసలు నచ్చదట. ఈ సినిమాని ఇప్పుడు చూసినా నాగ చైతన్య ని తిడుతుందట. అంత ఇష్టంలేని సినిమా అట ఆమెకు. అదే విధంగా ఆమెకు బాగా ఇష్టమైన నాగ చైతన్య సినిమా ‘ఏ మాయ చేసావే’ అట. ఈ సినిమాని ఆమె ఎన్నిసార్లు చూసిందో లెక్కే లేదట. ఈ విషయాన్నీ స్వయంగా నాగ చైతన్య ‘తండేల్’ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ‘ఏ మాయ చేసావే’ చిత్రం ద్వారా నాగ చైతన్య, సమంత మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలాంటి సినిమాని శోభిత నచ్చడం గమనించాల్సిన విషయం.
ఇకపోతే శోభిత, నాగ చైతన్య కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు, భవిష్యత్తులో అవకాశం వస్తే నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు, ఎందుకు నటించను?, మంచి కథ దొరికితే నేను ఎప్పటికీ సిద్దమే అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘తండేల్’ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల జాతర ని సృష్టిస్తుంది. మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్ ని దక్కించుకొని నాగ చైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ గా నిల్చిన ఈ చిత్రం, రెండవ రోజు కూడా అదే జోరుని కొనసాగిస్తుంది. ఊపు చూస్తుంటే మొదటి వారం లోనే ఈ చిత్రం నాగ చైతన్య కి మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్సర్ గా నిలుస్తుందని ట్రేడ్ పండితులు అనుకుంటున్నారు. ఫుల్ రన్ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయనున్నారు.