Naga Chaitanya : సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే టాపిక్స్ లో ఒకటి నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం. వీళ్లిద్దరు విడాకులు తీసుకొని మూడేళ్ళ సమయం దాటింది. ఎవరి జీవితాలను వాళ్ళు చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. నాగ చైతన్య అయితే గత ఏడాది శోభిత దూళిపాళ్ల ని పెళ్లి చేసుకున్నాడు, సమంత తన సినిమాలతో తానూ బిజీ గా గడుపుతుంది. కానీ వీళ్ళిద్దరిని కలుపుతూ ఇప్పటికీ ఎదో ఒక కథనం సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది. దానికి తోడు సమంత కొన్ని ఇంటర్వ్యూస్ లో విడాకుల వ్యవహారం ని తలచుకొని ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు వైరల్ అవ్వడం అగ్నికి వాయువు తోడైనట్టు అయ్యింది. ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటే అసలు పడడం లేదు. ఎదో ఒక సందర్భంలో ఈ వ్యవహారం గురించి చర్చించుకుంటూనే ఉంటారు. రీసెంట్ గా నాగ చైతన్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయంపై చాలా ఘాటుగా స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఈ లోకం లో ఎక్కడా విడాకులు జరగడం లేదా..? , నేనేదో మహా పాపం చేసినట్టు చిత్రీకరించి చూపిస్తున్నారు. ఒక రెలెటిన్ షిప్ ని బ్రేక్ చేయడానికి ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించేవాడిని, నేను కూడా ఒక విడాకులు తీసుకున్న అమ్మ నాన్నలకు పుట్టిన బిడ్డనే, నాకు తెలుసు ఆ ఒత్తిడి ఎలా ఉంటుంది అనేది. మా ఇద్దరికీ విడాకులు జరగడం ఒక దురదృష్టకరమైన సంఘటనగానే నేను భావిస్తాను. మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా లో ఎదో ఒక చర్చ జరుగుతుంది కదా అని, నేను దానిపై స్పందిస్తే, మళ్ళీ కొత్త కథలు అల్లేస్తారు. నా సహనాన్ని పరీక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దీనికి ఫుల్ స్టాప్ ఉండదా?, నేను ఆపలేను, రాసేవాళ్ళే రాయడం మానుకోవాలి’ అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇంత పద్దతిగా, పరిణీతి చెందిన వాడిగా నాగచైతన్య మాట్లాడిన ఈ మాటలను చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఫిదా అయిపోయారు. ఇది స్పందించే తీరు అంటూ ప్రశంసిస్తున్నారు. ఇకపోతే ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తండేల్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకుంది. చాలా కాలం నుండి సరైన సూపర్ హిట్ లెక్క ఇబ్బంది పడుతున్న నాగ చైతన్య ఈ చిత్రం తో కుంభస్థలం బద్దలు కొట్టాడు. అక్కినేని అభిమానులు కూడా చాలా కాలం తర్వాత సోషల్ మీడియా లో మంచి జోష్ మీద కనిపిస్తున్నారు. అక్కినేని అభిమానుల పరువు కాపాడావు అంటూ నాగ చైతన్య ని పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. బంపర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత రాబడుతుందో చూడాలి.
