Suryakumar Yadav: రోహిత్ కోసం బ్యాటింగ్ వదిలేసి ముంబై వీధుల్లో పడ్డ సూర్యకుమార్ యాదవ్…

సూర్య కుమార్ యాదవ్ తనను తాను ఎవరు గుర్తు పట్టకుండా గెటప్ వేసుకొని ఓ జర్నలిస్టు అవతారంలోకి మారిపోయి ఒక కెమెరా మెన్ ని తన వెంట వేసుకొని ముంబై వీధుల్లో తిరుగుతూ ముంబై లో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిన మెరైన్ డ్రైవ్ కి వెళ్ళాడు.

Written By: Gopi, Updated On : November 1, 2023 2:37 pm

Suryakumar Yadav

Follow us on

Suryakumar Yadav: ప్రస్తుతం ఇండియా వరల్డ్ కప్ లో దుమ్మురేపుతోంది. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచ్ ల్లో ఆరు మ్యాచ్ లు విజయం సాధించి సెమీస్ కి కూడా క్వాలిఫై అయ్యారు ఇక ఇలాంటి క్రమం లో ఇండియానే ఈసారి వరల్డ్ కప్ సాధించబోతుంది అంటూ చాలా మంది క్రికెట్ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇలాంటి క్రమం లో ఇండియా కప్పు కొట్టడం మీదనే ఫోకస్ పెట్టినట్టు గా తెలుస్తుంది.

ఇక తర్వాత శ్రీలంక మీద జరిగే మ్యాచ్ ముంబై లోని వాంఖడే స్టేడియం లో జరుగుతూ ఉండడం వల్ల ఇప్పటికే ఇరు జట్లు కూడా ముంబై చేరుకున్నాయి. ఇక అందులో భాగంగానే ఇండియన్ బెస్ట్ బ్యాట్స్ మెన్ అయిన సూర్య కుమార్ యాదవ్ తనను తాను ఎవరు గుర్తు పట్టకుండా గెటప్ వేసుకొని ఓ జర్నలిస్టు అవతారంలోకి మారిపోయి ఒక కెమెరా మెన్ ని తన వెంట వేసుకొని ముంబై వీధుల్లో తిరుగుతూ ముంబై లో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిన మెరైన్ డ్రైవ్ కి వెళ్ళాడు. అక్కడ క్రికెట్ అభిమానులతో చాలా సేపు మాట్లాడాడు అందులో భాగంగానే ఆయన అభిమానులను పలురకాల ప్రశ్నలు కూడా అడిగాడు…ప్రస్తుతం దానికి
సంభందించిన ఒక వీడియో నెట్ లో తెగ హల్చల్ చేస్తుంది.ఇక ఇలాంటి క్రమం లో సూర్య చేసిన ఫన్ కి జనాలు అందరు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అయితే ఈ క్రమం లోనే ఇండియా నెక్స్ట్ శ్రీలంక మీద ఆడే మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ టీమ్ లో ఉంటాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే హార్దిక్ పాండ్య గాయం నుంచి కోలుకొని ఇండియన్ టీమ్ లోకి రాబోతున్నాడు ఇక అందులో భాగంగానే సూర్య టీమ్ లో ఉంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక సూర్య ఇంగ్లాండ్ మీద ఆడిన మ్యాచ్ లో తనదైన రీతి లో అద్బుతం గా బ్యాటింగ్ చేసి టీమ్ ని ఆదుకున్నాడు కాబట్టి ఆయనని నెక్స్ట్ మ్యాచ్ లో తీసుకోవాలని చూస్తున్నారు. మరి రోహిత్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియాల్సి ఉంది…మరి హార్డిక్ ని డైరెక్ట్ గా సెమీ ఫైనల్.లోనే తీసుకోవాలని ఇండియన్ మాజీ క్రికెటర్లు వాళ్ల అభిప్రాయాలను.వ్యక్తం చేస్తున్నారు…ఇక ఇలాంటి క్రమం లో ఇండియా వరల్డ్ కప్ కొట్టాలని కోరుకుందాం…