Soundarya: సౌందర్య మళ్లీ పుట్టింది.. అచ్చం అలాగే ఉంది.. షాకిచ్చే ఫోటోలు.. వీడియోలు వైరల్

పవన్ కళ్యాణ్, సమంత వంటి స్టార్లలాగా ఉన్న ఎంతో మంది సాధారణ వ్యక్తులు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన వారు కూడా స్టార్లలాగా ఎదిగారు. అదే తరహాలో సౌందర్య రూపంలో ఉన్న అమ్మాయి కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.

Written By: Suresh, Updated On : November 1, 2023 2:43 pm

Soundarya

Follow us on

Soundarya: మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటారు. ఇలాంటి మనుషులు చాలా సార్లు తారస పడుతుంటారు. కొన్ని సార్లు ఎవరో అనుకొని మిమ్మల్ని పలకరించే ఉంటారు. లేదా మీలాగే మా చుట్టాలు, ఫ్రెండ్స్ ఉన్నారంటూ చెబితే ఆశ్చర్యపోవచ్చు కూడా. సెలబ్రిటీల విషయంలో కూడా ఇలాంటివి చాలా సార్లు జరుగుతుంటాయి. కొన్ని సార్లు అభిమాన స్టార్ల పోలిక లాగా ఉండేలా గెటప్ వేసుకుంటారు కొందరు. ఇదిలా ఉంటే అచ్చం సమంత లాగా ఉన్న అషు రెడ్డి ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు ఏకంగా బిగ్ బాస్ వరకు వెళ్లింది.. అయితే ఇప్పుడు దివంగత నటి సౌందర్యలాగా ఉన్న మరో అమ్మాయి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆమె గురించి మీకోసం..

పవన్ కళ్యాణ్, సమంత వంటి స్టార్లలాగా ఉన్న ఎంతో మంది సాధారణ వ్యక్తులు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన వారు కూడా స్టార్లలాగా ఎదిగారు. అదే తరహాలో సౌందర్య రూపంలో ఉన్న అమ్మాయి కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. దాదాపు 12 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి రిమార్క్ లేకుండా స్టార్ హీరోయిన్ గా కొనసాగింది సౌందర్య. అందమైన రూపం, ఆకట్టుకునే నటనతో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 100 సినిమాల్లో నటించి స్టార్ గా ఎదిగింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. 2004లో చనిపోయిన ఈ అమ్మడును ఇప్పటికీ ఆమె అభిమానులు మర్చిపోలేదు అనేది కాదనలేని వాస్తవం.

ఆమె లేదనే నిజం జీర్ణించుకోలేని అభిమానులకు సౌందర్య రూపంలో ఉన్న మరో అమ్మాయి ఊపిరిపోస్తుంది.అచ్చం సౌందర్యను చూసినట్టుగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. సౌందర్య లాంటి ముఖం, ఆమెలా చీర కట్టు, జడ, మల్లెపూలు పెట్టుకొని అచ్చం సౌందర్య లాగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ఈమె పేరు చిత్ర. తమిళనాడుకు చెందిన చిత్ర మలేషియాలో నివాసం ఉంటుంది. అక్కడ ఉంటూ టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ ద్వారా రీల్స్ చేస్తుంటుంది. దీంతో ప్రతి ఒక్కరు సౌందర్య లాగా ఉన్నావని కామెంట్లు చేశారు. కానీ మరికొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రీల్స్ చేస్తుందని కామెంట్స్ చేశారు. కానీ ఈ డీఐ పై కూడా క్లారిటీ ఇచ్చింది చిత్ర. నేను ఎలాంటి టెక్నాలజీ వాడడం లేదని.. సౌందర్య గారిలా ఉండడం నా అదృష్టం అని తెలిపింది. ఇలా ఒక స్టార్ హీరోయిన్ రూపం ఉండడంతో ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు. కానీ సౌందర్య కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఎవరూ ఫోన్ చేయలేదని అంటున్నారు కొందరు.