https://oktelugu.com/

Prashanth Neel- NTR: ప్రశాంత్, ఎన్టీఆర్ కాంబోలో సినిమా.. స్టోరీ వింటే గూస్ బాంబ్సే

దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో మరో సినిమా చేయబోతున్నారట. అంతేకాదు ఎప్పటి నుంచో అభిమానులు ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో కూడా మరో సినిమా రాబోతోంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 1, 2023 / 02:34 PM IST
    Follow us on

    Prashanth Neel- NTR: మల్టిపుల్ రోల్స్ చేయడంలో జూ.ఎన్టీఆర్ ను మించిన వారుండరనేది కాదనలేని సత్యం. ఈయన నటించే సినిమాలు మంచి హిట్ ను అందుకుంటాయి. జైలవకుశ సినిమాలు మూడు క్యారెక్టర్లు చేసి భారీ హిట్ ను అందుకున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ స్టార్ హీరో. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఫుల్ గా ఎదురుచూస్తున్నారు.

    దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో మరో సినిమా చేయబోతున్నారట. అంతేకాదు ఎప్పటి నుంచో అభిమానులు ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో కూడా మరో సినిమా రాబోతోంది. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రావాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అభిమానులు. అందరూ అనుకున్నట్టుగానే ఈ సినిమా కూడా రాబోతుంది. అయితే ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారట. ఇక మల్టీ రోల్స్ కు పెట్టింది పేరు నందమూరి ఫ్యామిలీ. అందులో ఎన్టీఆర్ మరింత దూసుకుపోతుంటారు. కాబట్టి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించేలా సినిమా చేయబోతున్నారట ప్రశాంత్ నీల్.

    ఇక ఈ సినిమా స్టోరీ ఏంటంటే.. ఇద్దరిగా కనిపించే ఎన్టీఆర్ ఒకరు రాష్ట్రానికి సీఎం అయితే.. మరొకరు పాలిటిక్స్ తో సంబంధం లేకుండా ఫ్యామిలీకి సంబంధించిన కామన్ మ్యాన్ గా కనిపిస్తారట. అయితే ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? అసలు స్టోరీ ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మొత్తం మీద ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ రెడీ అయిందట. కానీ ఈ సినిమాతో మరో సూపర్ హిట్ ఎన్టీఆర్ ఖాతాలోకి రావడం పక్కా అంటున్నారు అభిమానులు.