India Vs Australia World Cup Final: వరల్డ్ కప్ 2023 లో భాగంగా ఇండియన్ టీం ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈరోజు జరిగే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు దానిమీద క్లారిటీ అయితే లేదు.ఎందుకంటే రెండు టీమ్ లు కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి.ఇక దానికి తోడు గా ఇది ఫైనల్ మ్యాచ్ కావడం వల్ల చివరి నిమిషం లో ఏదైనా జరగవచ్చు. ఇక దానికి తగ్గట్టుగానే రెండు టీములు కూడా భారీ మార్పులను చేసుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ మ్యాచ్ ఆడుతుంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అవడం వల్ల ఈ పిచ్ ఎక్కువగా స్పిన్ కి అనుకూలిస్తుంది కాబట్టి ఇండియన్ టీం కూడా ఎక్స్ ట్రా స్పిన్నర్ ని టీం లోకి తీసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సూర్య కుమార్ యాదవ్ గత మ్యాచ్ ల్లో అంత మంచి పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు కాబట్టి అతని ప్లేస్ లో స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ ని తీసుకోవాలని చూస్తున్నారు. అశ్విన్ అయితే ఆస్ట్రేలియా మీద మంచి రికార్డు ఉంది. కాబట్టి అలాగే ఈ పిచ్ కూడా స్పిన్ కి అనుకూలిస్తుంది కాబట్టి అతను ఆస్ట్రేలియన్ టీం బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేయడంలో చాలావరకు టీం కి హెల్ప్ అవుతాడని ఇండియన్ టీం కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అలాగే కోచ్ రాహుల్ ద్రావిడ్ గట్టిగా నమ్ముతున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఫైనల్ టీంలో సూర్య ప్లేస్ లో అశ్విన్ వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి…
ఇక అశ్విన్ టీంలోకి వస్తే ఆస్ట్రేలియన్ టీం లో దిగ్గజ ప్లేయర్లుగా ఉన్న స్టీవ్ స్మిత్ , గ్లెన్ మాక్స్ వెల్ లాంటి ప్లేయర్లను కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద అశ్విన్ కు ఇంతకు ముందు కూడా మంచి రికార్డు ఉంది. ఇక ఇండియన్ టీం ఈ మ్యాచ్ లో గెలవాలి అంటే టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకుంటే ఆస్ట్రేలియాను చాలా తక్కువ స్కోర్ కే కట్టడి చేసి చేజింగ్ లో ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని చేదించి గెలవాల్సి ఉంటుంది.
ఇక లేదు అంటే ఇండియా కనక మొదట బ్యాటింగ్ తీసుకున్నట్లయితే భారీ స్కోరు చేసి ఒక భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచాలి ఇక సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ మీద ఎలాగైతే 397 రన్స్ చేశారో ఆ విధంగానే ఆస్ట్రేలియన్ టీమ్ మీద కూడా అంతటి భారీ స్కోర్ చేయగలిగితే ఇండియా విజయం
ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో బౌలర్లు కీలక పాత్ర వహించాలి. మరోసారి షమీ విజృంభిస్తే ఇండియన్ టీమ్ విజయం ఈజీ అవుతుంది…ఇక బ్యాట్స్ మెన్స్ విషయానికి వస్తె కోహ్లీ, రోహిత్, గిల్, అయ్యర్, రాహుల్ లాంటివారు వాళ్ల పరిధి మేరకు రాణించి ఇండియాని గెలిపించడంలో కీలకపాత్ర వహించాలి…