Suryakumar Yadav: టీమ్ ఇండియా క్రికెట్ జట్టులో విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్న సూర్య కుమార్ యాదవ్ చాలా రోజుల తర్వాత తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. గయానా వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో ఎట్టకేలకు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇప్పటివరకు మబ్బులు చాటున ఉన్న సూర్యుడు ఒక్కసారి బయటకు వచ్చినట్టు ఎంతో ముఖ్యమైన మూడవ టి20 మ్యాచ్ లో సూర్య తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.
ప్రత్యర్థి బౌలర్లపై సూర్య దండయాత్ర ఊచకోతకు దారితీసింది. కేవలం 23 బంతులలో మెరుపు వేగంతో హాఫ్ సెంచరీని పూర్తి చేసిన సూర్య సరికొత్త రికార్డును నెలకొల్పాడు. మ్యాచ్ మొత్తానికి 44 బంతులు ఎదుర్కొన్న సూర్య 10 ఫోర్లు ,4 సిక్సుల తో విండీస్ టీం ను ఫీల్డ్ అంతా పరుగులు పెట్టించాడు. 44 బంతులకు 83 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత్ ను విజయం వైపు నడిపించాడు.
ఈ మ్యాచ్ లో విజృంభించి ఆడడమే కాకుండా పలు రకాల రికార్డ్లను తన పేరుతో లిఖించుకున్నాడు సూర్య. ఈ మ్యాచ్లో నాలుగు సిక్సులు సాధించిన సూర్య,అంతర్జాతీయ టి20 మ్యాచ్ లో 100 సిక్స్‌ల మైలురాయిని అందుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ లో పదవ ఓవర్ వేసిన విండీస్ బౌలర్ షెఫెర్డ్ బౌలింగ్‌లో సూర్య తన వందవ సిక్స్ ను బౌండరీ దాటించాడు. దీనితోపాటుగా అత్యంత వేగంగా టి20 లలో 100 సిక్సులు కొట్టిన రెండవ ఆటగాడిగా సూర్య రికార్డ్. అలాగే t20 లలో 100 సిక్సుల మైలురాయిని అందుకున్న మూడవ భారత్ బెటర్ గా కూడా సూర్యకుమార్ నిలిచాడు. ఈ జాబితాలో అతనికంటే ముందు టీమ్ ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ మరియు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నారు.
గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం ట్రిక్కీ పిచ్‌పై సూర్య విండీస్ బౌలింగ్ దాడికి అడ్డుకట్ట వేశాడు. 360 డిగ్రీస్ యాంగిల్ లో షాట్లు బాధడమే కాకుండా 160 పరుగుల టార్గెట్ ను సునాయాసంగా చేదించడంలో ఇండియన్ టీం ను ముందుండి నడిపించాడు. ఈ ఒక్క మ్యాచ్ ఓడిపోయి ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేది.. ఎందుకంటే సిరీస్ విండీస్ కైవసం అయ్యేది. ఇతర ఫార్మేట్ లలో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ టి20 మ్యాచ్ లలో మాత్రం సూర్య మెరుస్తూనే ఉన్నాడు. 50 ఓవర్ల ఫార్మేట్లో ఇంకా అతను ఎందుకు విజయం సాధించలేకపోతున్నాడు అన్న విషయం ప్రశ్నార్థకంగానే ఉంది.
ఇదే విషయాన్ని మాథ్స్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సూర్య కూడా ప్రస్తావించారు.” నిజాయితీగా చెప్పాలి అంటే వన్డే క్రికెట్ విషయంలో నేను చాలా బలహీనంగా ఉన్నాను. నిజం ఒప్పుకోవడానికి నాకు ఎటువంటి ఇగో లేదు”అని నిర్మోహమాటంగా అన్నారు. అయితే ముంబై మాజీ కోచ్ అమోల్ ముజుందార్ మాత్రం సూర్య కాస్త ఓపికగా ఆడితే వన్డే మ్యాచ్ పెద్ద కష్టం కాదు , అతను ఈ ఫార్మాట్లో రాణించడానికి కాస్త సమయం పడుతుంది అని అన్నారు.
సూర్య కుమార్ కు ఇదే చక్కటి అవకాశం రాబోయే 50 ఓవర్ ఆసైన్మెంట్స్ లో తన ప్రతిభను కనబరిచి నిలకడైన ప్రదర్శనను ఇవ్వగలిగితే ప్రపంచ వన్ డే కప్ టీం లో అతని స్థానం సుస్థిరమవుతుంది.