CM Jagan: కాంగ్రెస్ పార్టీకి జగన్ ఫండింగ్.. అందులో వాస్తవం ఎంత?

తెలంగాణకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కోసం భారతీయ జనతా పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు.

Written By: Dharma, Updated On : August 10, 2023 12:24 pm

CM Jagan

Follow us on

CM Jagan: కాంగ్రెస్ పార్టీకి జగన్ ఫండింగ్ చేస్తున్నారా? కర్ణాటక ఎన్నికల ఫలితాలతో పునరాలోచనలో పడ్డారా? బిజెపితో స్నేహం చేస్తూనే.. హస్తంతో దోస్తీ కడుతున్నారా? ఇదంతా కేసుల భయంతో చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.

తెలంగాణకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కోసం భారతీయ జనతా పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఆయన కాంగ్రెస్ లోనే చేరారు. ఇలా చేరే ముందు జగన్కు మూడు,నాలుగు సార్లు కలిశారు. తాడేపల్లి వచ్చి ఏకాంత చర్చలు జరిపారు. అటు తరువాత కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. అంటే జగన్ అనుమతితోనే ఆయన కాంగ్రెస్లో చేరినట్లు అయింది. జగన్ సైతం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పొంగులేటిని కాంగ్రెసులో పంపించారన్న టాక్ ప్రారంభమైంది.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత… రెండు కంపెనీలే కాంట్రాక్టులు దక్కించుకున్నాయి.అందులో ఒకటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ.. మరొకటి రాఘవ కన్స్ట్రక్షన్. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సీఎం జగన్, అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులది. రెండోది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది. అయితే పొంగులేటి కంపెనీ ఏపీలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను దక్కించుకుంది.ఒక విధంగా చెప్పాలంటే జగన్కు నమ్మిన బంటు.ఇటీవలే ఆయన టిఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు.

వాస్తవానికి పొంగులేటి బిజెపిలో చేరాలి. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బిజెపి పొంగులేటి గురించి బలంగా ప్రయత్నించింది. కానీ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తర్వాత పొంగులేటి మనసు మార్చుకున్నారు. కానీ జగన్ అనుమతి లేనిదే ఆయన గడప కూడా దాటరు. కచ్చితంగా జగన్ అనుమతి తీసుకునే ఉంటారు.

అయితే జగన్ కోసమే పొంగులేటి కాంగ్రెస్ వైపు అడుగులు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. తన కేసుల జోలికి రాకూడదన్నదే జగన్ అభిమతం. అవసరమైతే పొంగులేటి ద్వారా కాంగ్రెస్ పార్టీ కి ఫండింగ్ చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.జగన్ ఒకవైపు బిజెపితో స్నేహం కొనసాగిస్తూనే.. కాంగ్రెస్తో వైరం లేకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులోఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.