Pawan Kalyan OG Teaser: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమా తరువాత ప్రస్తుతం ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో OG చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు క్రిష్ అలానే హరీష్ శంకర్ తో కూడా పవన్ కళ్యాణ్ కి సినిమాలో ఉన్న OG సినిమా పైనే పవన్ అభిమానులకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంతేకాదు OG చిత్రానికే పవన్ కళ్యాణ్ చివరగా సైన్ చేశారు. కానీ షూటింగ్ మాత్రం ఈ సినిమాకే శరవేగంగా కొనసాగుతోంది.
మరోపక్క హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి ఇటీవలే షేర్ చేసిన గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ విశ్వరూపం చూపించాడు. అయితే ఈ సినిమా థేరి రీమేక్ అని ప్రచారం జరుగుతున్నందున, అభిమానులు #TheyCallHimOG వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు, సెప్టెంబర్ 2 న OG ఫస్ట్ లుక్ లేదా టీజర్‌తో అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని ఈ సినిమా మేకర్స్ నిర్ణయించుకున్నట్లు వినికిడి.
డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది.
ఇప్పటికే ఓవర్సీస్ హక్కుల కోసం ఈ సినిమాకు రికార్డ్ రేటు రావడం సినిమా చుట్టూ ఉన్న హైప్ మరింత పెరిగింది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తోన్న లుక్ లేదా టీజర్ కూడా అభిమానులను ఆకట్టుకుంటే తప్పకుండా ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుతాయి.
ఇదిలా ఉంటే, క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ బ్యాలన్స్ షూటింగ్‌ను కూడా పవన్ త్వరలోనే పూర్తి చేయనున్నారట. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.