Surya Kumar Yadav : మెగా క్రికెట్ ఈవెంట్ ఐపీఎల్ ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. టాప్ 4లో చోటు దక్కించుకోవడానికి జట్లు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్, రాజస్థాన్, చెన్నై ఇప్పటికే క్వాలిఫయర్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఈ సీజన్‌లో చాలా మంది యాదవ్ ఆటగాళ్ళు తమ ప్రతిభను చూపిస్తున్నారు. మరి వారి గురించి తెలుసుకుందామా?
భారత క్రికెట్ జట్టులో బ్యాట్స్‌మన్ సూర్య కుమార్ యాదవ్ ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున అనేక మ్యాచ్‌లలో ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ వేగవంతమైన బ్యాటింగ్ కు పేరుగాంచాడు. ఏ బౌలర్ ను అయినా లక్ష్యంగా చేసుకుని లాంగ్ సిక్సర్లు కొట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు సూర్య కుమార్.
Also Read : విరాట్ కోహ్లీ నటించిన ఏకైక సినిమా అదేనా? ఇన్ని రోజులు గమనించలేదుగా!
మయాంక్ యాదవ్ గత సీజన్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ సీజన్‌లో కూడా అతను లక్నో సూపర్ జెయింట్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. మయాంక్ యాదవ్ ఫాస్ట్ బౌలింగ్ కు చేస్తే చూసి ఎవరైనా ఆశ్యర్యపోవాల్సిందే. అతను స్థిరంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సామర్థ్యంతో ఎంతో మందిని ఫ్యాన్స్ ను చేసుకున్నాడు. IPL 2024లో అతను తన అద్భుతమైన వేగంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 150 kmph కంటే ఎక్కువ వేగంతో బంతిని వేయగలడం అంటే మామూలు విషయం కాదు కదా. అతను గత సీజన్లో 156.7 kmph వేగంతో బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. IPL 2024లో 4 మ్యాచ్‌లలో 7 వికెట్లు పడగొట్టి మరింత పేరు సంపాదించాడు మయాంక్. గాయం కారణంగా కొంత సమయం జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఫిట్‌గా మారాడు. జట్టులోకి తిరిగి వచ్చాడు.
భారత జట్టు ప్రధాన స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. కుల్దీప్ ఎడమచేతి వాటం చైనామన్ ఎడమచేతి అసాధారణ స్పిన్ బౌలింగ్ కు ప్రసిద్ధి చెందాడు. ఈ సంవత్సరం అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నప్పుడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన సీజన్లో 21 వికెట్లు పడగొట్టి, టోర్నమెంట్‌లో టాప్-5 వికెట్లు పడగొట్టిన బౌలర్లలో ఒకడు అయ్యాడు. అతను తన అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యంతో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నికోలస్ పూరన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ప్రిన్స్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఈ సంవత్సరం IPL 2025లో ఎంట్రీ ఇచ్చాడు. ట్రావిస్ హెడ్ వికెట్ తీసిన తర్వాత ప్రిన్స్ వెలుగులోకి వచ్చాడు. 2024 సంవత్సరంలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ప్రిన్స్ హ్యాట్రిక్ సాధించాడు.
IPL 2025 కోసం జయంత్ యాదవ్‌ను గుజరాత్ టైటాన్స్ నిలుపుకుంది. అయితే, అతను ఇంకా ఏ మ్యాచ్ ఆడలేదు. జనత్ తన కుడిచేతి ఆఫ్‌బ్రేక్ బౌలింగ్, కుడిచేతి బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు.
Also Read : ఉప్పల్ లో ఆడే ఒక్క మ్యాచ్ కు SRH ఎంత చెల్లిస్తుందో తెలుసా?