https://oktelugu.com/

Sunrisers: ఐపీఎల్‌లో అస్తమిస్తున్న ‘సన్‌’రైజర్స్‌..!  

న్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఏ మాత్రం కూడా ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలు లేవు. ఈ జట్టుకు ఉన్న ప్లేఆఫ్‌ ఛాన్సులు నాలుగు శాతం మాత్రమే. పాయింట్ల పట్టికలో పదో స్థానానికి దిగజారింది.

Written By: , Updated On : May 7, 2023 / 12:01 PM IST
Follow us on

Sunrisers: ఐపీఎల్‌ 2023 సీజన్‌ సెకెండ్‌ హాఫ్‌.. పోటాపోటీగా సాగుతోంది. స్టేడియాల్లో పరుగుల వరద పారుతోంది. భారీ లక్ష్యాలు సైతం చిత్తుచిత్తవుతున్నాయి. 200లకు పైగా చేసిన టార్గెట్‌ కూడా గెలుపుపై గ్యారెంటీ ఇవ్వట్లేదు. భారీగా పరుగులు రాబట్టిన జట్లు కూడా పరాజయాన్ని చవి చూస్తోన్నాయి. ప్లేఆఫ్స్‌ కోసం ప్రత్యర్థికి దీటుగా తలపడుతున్నాయి. శనివారం రాత్రి మొహాలీలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 181 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ అలవోకగా ఛేదించింది. 20 బంతులు మిగిలివుండగానే కొట్టిపడేసింది. రెండు జట్ల ఇన్నింగ్స్‌లోనూ బ్యాటర్లు దుమ్ము లేపారు. బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ సీజన్‌లో బ్యాటర్లు తెగించి ఆడుతున్నారు. కౌంటర్‌ అటాక్‌కు దిగుతూ బౌలర్లకు చుక్కులు చూపిస్తోన్నారు.

ప్లే ఆఫ్‌ కోసం పట్టుదలగా… 
ప్లేఆఫ్స్‌ సమీపిస్తోన్న కొద్దీ మ్యాచ్‌లు మరింత హోరాహోరీగా మారుతున్నాయి. జట్ల మధ్య పోటీ తీవ్రతరమౌతోంది. గెలిచి తీరాలనే తపన కనిపిస్తోంది. ప్లేఆఫ్స్‌ రేసులో తామూ ఉండాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి. ఢిల్లీ కేపిటల్స్‌ ఇన్నింగ్‌లో ఇదే కనిపించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన వార్నర్‌ సేన.. తెగించి ఆడింది. ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడింది. తన పాయింట్లను పెంచుకోగలిగింది.
ప్లేఆఫ్‌ ఆశలు నామమాత్రమే.. 
కానీ ఆ జట్టు ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలు నామమాత్రమే. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లను ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరింట్లో ఓడింది. నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇంకా నాలుగు మ్యాచ్‌లను ఆడాల్సి ఉందా జట్టు. అన్నింట్లోన నెగ్గినా ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలు దాదాపుగా లేనట్టే. తన తదుపరి మ్యాచ్‌లో బలమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ను తలపడాల్సి ఉంది. ఈ నెల 10వ తేదీన సాయంత్రం 7:30 గంటలకు ఇది షెడ్యూల్‌ అయింది.
ఆర్బీసీ ఆశలూ గల్లంతే.. 
ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓటమి తరువాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఉన్న ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలు దిగజారాయి. ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు వరకు 54 శాతంగా ఉన్న ప్లేఆఫ్‌ ఛాన్సులు– మ్యాచ్‌ తరువాత 34 కు పడిపోయాయి. ఈ జట్టు కూడా తాను ఆడబోయే మ్యాచ్‌లన్నింటినీ కచ్చితంగా గెలిచి తీరాల్సి పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇంకో మ్యాచ్‌ ఓడిందంటే ఆర్సీబీ అవకాశాలు మరింత కష్టతరమౌతాయి.
చివరి స్థానం కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ పోటీ.. 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఏ మాత్రం కూడా ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలు లేవు. ఈ జట్టుకు ఉన్న ప్లేఆఫ్‌ ఛాన్సులు నాలుగు శాతం మాత్రమే. పాయింట్ల పట్టికలో పదో స్థానానికి దిగజారింది. వరుస ఓటములతో చివరి నుంచి మొదటి స్థానంలో ఉండేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకా అయిదు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఈ అయిదింట్లో కూడా భారీ తేడాతో ప్రత్యర్థిని ఓడించి తన నెట్‌ రన్‌రేట్‌ను అంతే భారీగా మెరుగుపర్చుకుంటే తప్ప సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు చేరలేదు.