Sunrisers , Lucknow
Sunrisers and Lucknow : గురువారం ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో, హైదరాబాద్ (SRH vs LSG)జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హైదరాబాద్ ఆటగాళ్లు 300 స్కోర్ చేస్తారని అందరు ఊహించారు. కానీ శార్దూల్ ఠాకూర్ (shardul Thakur) ఎంట్రీతో ఒక్కసారిగా సీన్ మారింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్(Ishan Kishan) (0), అభిషేక్ శర్మ (Abhishek Sharma)(6) ను అవుట్ చేయడంతో హైదరాబాద్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ జట్టు కోలుకోలేకపోయింది. హెడ్ (47), నితీష్ (32), క్లాసెన్(26) సత్తా చూపించడంతో హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
Also Read : ఐపీఎల్ వేటకు SRH రెడీ.. కొత్త జెర్సీలో ఆటగాళ్లు ఎలా ఉన్నారంటే..
దంచి కొట్టిన పూరన్
191 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన లక్నో జట్టు ఏ దశలోనూ వెనకడుగు వేయలేదు. ఓపెనర్ మార్క్రం(1) వెంటనే అవుట్ అయినప్పటికీ.. వన్ డౌన్ గా వచ్చిన నికోలస్ పూరన్(70), మరో ఓపెనర్ మార్ష్ (52) రెండో వికెట్ కు కేవలం 43 బంతుల్లోనే 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా పూరన్ ఆకాశమే హద్దుగా చెలగిపోయాడు. ప్రతిబంతిని బలంగా కొట్టాడు.. సిక్సర్లు, ఫోర్ లతో మైదానాన్ని హోరెత్తించాడు. అంతేకాదు కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు..దీంతో లక్నో జట్టు పవర్ ప్లే లో ఒక వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. తుఫాన్ వేగంతో బ్యాటింగ్ చేస్తున్న పూరన్ కు హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ బ్రేక్ వేశాడు. దీంతో రెండో వికెట్ కు 116 పరుగుల వద్ద బ్రేక్ పడింది. ఆ తర్వాత మార్ష్ మరిత వేగంగా ఆడి 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అతడు కూడా కమిన్స్ బౌలింగ్ లో ఉంటాడు. అయితే తక్కువ పరుగుల వ్యవధిలోనే రిషబ్ పంత్ (15), ఆయుష్ బదోని (6) అవుట్ అయినప్పటికీ అబ్దుల్ సమ్మద్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో.. మరో 23 బంతులు మిగిలి ఉండగానే లక్నో జట్టు విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా ఐపిఎల్ లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన రికార్డును లక్నో జట్టు సృష్టించింది. 7.3 ఓవర్లలోనే లక్నో జట్టు 100 పరుగుల మైలురాయి అందుకుంది. ఇక 20 బంతుల్లోనే ఎక్కువ హాఫ్ సెంచరీలు (4) చేసిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు. ఒకవేళ పూరన్ కనుక అవుట్ కాకపోయే ఉండి ఉంటే మరింత సులభంగా టార్గెట్ రీచ్ అయ్యేది. అతడు అవుట్ అయిన తర్వాత స్కోర్ వేగం తగ్గినప్పటికీ తుది ఫలితం మాత్రం మారలేదు.
Also Read : ఫైనల్ చేరిన కావ్య పాప టీం.. మరో కప్ లోడింగ్..