Sunrisers Eastern Cape: కావ్య పాప అంటే మినిమం ఉంటది.. అది ఓటమైనా, గెలుపైనా ఒక రేంజ్ లో ఉంటది. అందువల్లే సన్ రైజర్స్ జట్టుకు ఒక రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉంటుంది.. చాలా జట్లలో ఆటగాళ్లకు మాత్రమే అభిమానులు ఉంటారు. సన్ రైజర్స్ జట్టులో మాత్రం కావ్య మారన్(kavya maran) కు బీభత్సమైన అభిమానులు ఉంటారు. కావ్య మారన్ కూడా అభిమానులను ఏమాత్రం నిరుత్సాహానికి గురి చేయకుండా.. ఎప్పటికప్పుడు స్టేడియంలో సందడి చేస్తూ ఉంటుంది. తన హావ భావాలతో ఆకట్టుకుంటుంది.
అయితే ఇప్పుడు మన దేశంలో ఐపిఎల్ జరగకపోయినప్పటికీ.. సౌత్ ఆఫ్రికాలో క్రికెట్ లీగ్ కొనసాగుతోంది.. ఈ టోర్నీలో కావ్య పాప యజమానిగా వ్యవహరిస్తున్న సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్(sunrisers eastern cape) ఫైనల్ వెళ్ళింది. ఇప్పుడు టైటిల్ ఫైట్ కు సిద్ధమైంది. ప్రస్తుతం కావ్య పాప టీం జోరు చూస్తుంటే మరోసారి విజేతగా ఆవిర్భవించడం ఖాయంగా కనిపిస్తోంది. సౌత్ ఆఫ్రికా లో జరుగుతున్న SA-20 క్రికెట్ లీగ్ లో కావ్య మారన్ యజమానిగా వ్యవహరిస్తున్న సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు ఎదురనేదే లేకుండా దూసుకుపోతోంది. వరుసగా రెండవసారి ఎస్ఏ లీగ్ -20 లో ఫైనల్ వెళ్ళింది. పార్ల్ రాయల్స్ జట్టుతో జరిగిన నాకౌట్ మ్యాచ్లో ఆ జట్టు ఎనిమిది టికెట్లు తేడాతో విజయం సాధించింది. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ లో గెలుపును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో పార్ల్ రాయల్స్ జట్టు ఓవర్లు మొత్తం ఆడింది. నాలుగు వికెట్లకు 175 పరుగులు చేసింది. పార్ల్ రాయల్స్ జట్టు ఓపెనర్ ప్రిటోరియస్ (59), రుబిన్ హెర్మన్(81) అదరగొట్టారు. ఆ తర్వాత ఆ టార్గెట్ చేజ్ చేయడానికి సన్ రైజర్స్ జట్టు రంగంలోకి దిగింది. ప్రారంభం నుంచి దూకుడుగా ఆడింది..
ధనాధన్ ఇన్నింగ్స్
సన్ జట్టు ఓపెనర్ టోనీ డీ జోర్జి (78), జోర్డాన్ హేర్మన్ (69*) మెరుపు వేగంతో పరుగులు తీశారు. ఇద్దరు పోటీపడి బౌండరీలు, సిక్సర్లు కొట్టారు. పార్ల్ రాయల్స్ జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.. ఇక చివర్లో సన్ రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 12 బంతుల్లో 11* పరుగులు చేసి విజయ లాంచనాన్ని పూర్తి చేశాడు. ఇక ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు గెలుపులో టోనీ జార్జి కీలకపాత్ర పోషించిన నేపథ్యంలో.. అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.. ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్ చేరిన సన్ రైజర్స్ జట్టు ఫిబ్రవరి 8న ముంబై ఇండియన్స్ జట్టుతో కేప్ టౌన్ లో తలపడుతుంది.. అయితే గత సీజన్లో సన్ రైజర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈసారి కూడా విజేతగా నిలవాలని తహతహలాడుతోంది. గత సీజన్లో సన్ రైజర్స్ జట్టు విజేతగా నిలవడంలో మార్క్రమ్ కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా అతడు అదే తీరుగా ఆడుతున్నాడు. గత సీజన్లో సన్ రైజర్స్ విజేతగా నిలిచి.. ఐపీఎల్ లో రన్నరప్ గా ఆవిర్భవించింది. అయితే ఈసారి ఎస్ ఏ -20 లో విజేతగా నిలిచి.. ఐపీఎల్ 2025 సీజన్ లోనూ ఛాంపియన్ గా ఆవిర్భవించాలని సన్ రైజర్స్ జట్టు భావిస్తోంది.. మరోవైపు సన్ రైజర్స్ జట్టు ఫైనల్ వెళ్లిన నేపథ్యంలో సోషల్ మీడియాలో కావ్య మారన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
! , pic.twitter.com/ivNT5iu50P
— Sunrisers Eastern Cape (@SunrisersEC) February 6, 2025