Sunrisers Hyderabad: ఆ స్టార్ ప్లేయర్ మీద కన్నేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్

ఒక్క మ్యాచ్ లో మాత్రమే సెంచరీ చేసి మిగిలిన అన్ని మ్యాచ్ ల్లో కూడా నిరాశ పరచడంతో సన్ రైజర్స్ టీం చాలా దారుణమైన ఓటమి లను చవి చూసింది. ఇక ఈ టీమ్ పాయింట్స్ టేబుల్లో చివరి స్థానం నిలిచి ప్రేక్షకులను విపరీతంగా నిరాశపరిచింది.

Written By: Gopi, Updated On : December 7, 2023 1:52 pm

Sunrisers Hyderabad

Follow us on

Sunrisers Hyderabad: ప్రస్తుతం హైదరాబాద్ టీమ్ ఐపిఎల్ లో తమదైన రేంజ్ లో ముందుకు దూసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ టీం నుంచి కొంతమంది ప్లేయర్లను ఆక్షన్ లోకి రిలీజ్ చేసింది.ఇక అందులో ముఖ్యంగా అత్యధిక డబ్బులను పెట్టి కొనుగోలు చేసిన హరి బ్రుక్ ని సన్ రైజర్స్ టీమ్ రిలీజ్ చేసింది. ఇక నిజానికి ఆయన మీద చాలా అంచనాలను పెట్టుకొని ఆయన్ని కొనుగోలు చేసినప్పటికీ ఆయన 2023 సీజన్ లో ఏ మాత్రం సత్తా చాటకుండా చతికిల పడ్డాడు.

ఒక్క మ్యాచ్ లో మాత్రమే సెంచరీ చేసి మిగిలిన అన్ని మ్యాచ్ ల్లో కూడా నిరాశ పరచడంతో సన్ రైజర్స్ టీం చాలా దారుణమైన ఓటమి లను చవి చూసింది. ఇక ఈ టీమ్ పాయింట్స్ టేబుల్లో చివరి స్థానం నిలిచి ప్రేక్షకులను విపరీతంగా నిరాశపరిచింది. ఇక దాంతో ఇప్పుడు సన్ రైజర్స్ హైద్రాబాద్ యాజమాన్యం 2024 సీజన్ లో ఎలాగైనా సరే కప్పు కొట్టాలనే ఉద్దేశ్యంతో ఒక ప్లేయర్ ని టీమ్ లోకి తీసుకోవాలని చూస్తున్నారు.ఇక ఆయన ఎవరు అంటే ఇంగ్లాండ్ కి చెందిన టామ్ కాడ్మోర్‌…

ప్రస్తుతం ప్రతి లీగ్ మ్యాచ్ లో కూడా తను బాగా ఆడుతూ తనదైన రీతిలో మంచి పర్ఫామెన్స్ ను ఇస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా లీగ్ మ్యాచ్ ల్లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారుతూ బౌలర్ల అందరికీ చుక్కలు చూపిస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఇతను టీం లో ఉంటే టీమ్ మొత్తం చాలా స్ట్రాంగ్ అవుతుందని హైదరాబాద్ టీమ్ యాజమాన్య భావిస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఇక దీంతో బ్రూక్స్ ప్లేస్ లో సన్ రైజర్స్ యాజమాన్యం కాడ్మోర్ ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు గా తెలుస్తుంది…డిసెంబర్ 19 న జరిగే వేలంలో ఈ పవర్ హిట్టర్ ను దక్కించుకోవడానికి భారీ ప్రయత్నాలు చేస్తుంది. ఈయన కోసం ఏకంగా 10 కోట్లు పెట్టడానికి హైద్రాబాద్ టీమ్ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక గత సీజన్ లో మాదిరి ఇపుడు కూడా అభిమానులను నిరాశ పరచకుండా ఉండేవిధంగా ఆ టీమ్ యజమాన్యం ప్లాన్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది. ప్రస్తుతం సన్ రైజర్స్ టీమ్ లో కెప్టెన్ మార్కరం, క్లాసన్ తో పాటు ఫిలిప్స్ లు ఉన్నారు. అయితే టాప్ ఆర్డర్ లో హైదరాబాద్ జట్టుకు సరైన బ్యాటర్ లేడు.ఇక ఇలాంటి సమయం లో వికెట్ కీపింగ్ కూడా చాలా బాగా చేయగల కాడ్మోర్‌ ని సన్ రైజర్స్ తన టీమ్ లోకి తీసుకుంటే ఆయన పర్ఫెక్ట్ గా టీమ్ కి సరిపోదు.

అలాగే ఆయన టీమ్ విజయం లో కూడా కీలక పాత్ర వహిస్తాడని సన్ రైజర్స్ యాజమాన్యం భావిస్తుంది.ఇక హైద్రాబాద్ బౌలింగ్ లో భువనేశ్వర్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్, సుందర్ లతో బౌలింగ్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మొత్తానికి ఇంగ్లాండ్ బ్యాటర్ స్థానంలో మరో ఇంగ్లాండ్ బ్యాటర్ ను తీసుకుంటారో లేదో చూడాలి.ఒకవేళ కాడ్మోర్ ని కనక తీసుకుంటే హైద్రాబాద్ టీమ్ కి ఇక తిరుగులేదని చెప్పాలి…