Homeక్రీడలుక్రికెట్‌Rajasthan Vs Hyderabad: ఇన్ని దరిద్రాలు.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకెలా గెలుస్తుంది..

Rajasthan Vs Hyderabad: ఇన్ని దరిద్రాలు.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకెలా గెలుస్తుంది..

Rajasthan Vs Hyderabad: కాటేరమ్మ కొడుకులు.. తోపులు.. తురుములు.. విధ్వంసకారులు.. ఇదిగో ఇలా ఇచ్చుకుంటూ పోయారు హైదరాబాద్ ఆటగాళ్లకు ఎలివేషన్లు. కానీ కీలకమైన దశలో కాటేరమ్మ కొడుకులు చేతులెత్తేశారు. గెలవాల్సిన చోట ఓడిపోయారు. గట్టిగా కొట్టాల్సిన చోట తలవంచారు. ఫలితంగా ట్రోఫీకలను నెరవేర్చుకోకుండానే ఉత్తి చేతులతో ఇంటికి వచ్చారు.

రాజస్థాన్ జట్టుతో ఈ ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు లీగ్ దశలో రెండు మ్యాచ్లు వరుసగా గెలిచింది. కీలకమైన క్వాలిఫైయర్ మ్యాచ్లో కూడా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ ఎంచుకుంది. సూర్య వంశీకి యార్కర్ బంతులు వేయాల్సిన చోట.. పుల్లర్ లెంతులు వేసింది. దీంతో అతడు దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. చూస్తుండగానే విధ్వంసాన్ని సృష్టించాడు. అందరి బౌలర్ల బౌలింగ్ ను ఉతికి ఆరేశాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సూర్య వంశీ 97 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 12 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అతడి విధ్వంసం వల్ల రాజస్థాన్ జట్టు ఏకంగా 243 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు కేవలం 196 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ 0 పరుగులకు అవుట్ కావడం అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది.. ఈ సీజన్లో అతడు భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. కీలకమైన దశలో చేతులెత్తేశాడు. హెడ్ కూడా ఒత్తిడి తట్టుకోలేక అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ బంతి గమనాన్ని అంచనా వేయలేక సులభమైన క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఉన్నంతసేపు అతడు ధాటిగా బ్యాటింగ్ చేసినప్పటికీ.. కీలక దశలో అవుట్ అయ్యాడు. సిమ్రాన్ రవిచంద్రన్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. క్లాసెన్ అవుట్ కావడం హైదరాబాద్ జట్టు విజయావకాశాలను పూర్తిగా దెబ్బతీసింది.. నితీష్ కుమార్ రెడ్డి, సలీం అరోరా దూకుడుగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివర్లో శివాంగు కుమార్ 27 పరుగులు చేసినప్పటికీ.. హైదరాబాద్ జట్టుకు ఫలితం లేకుండా పోయింది.

టాస్ గెలిచినప్పుడు హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకొని ఉంటే బాగుండేది. హైదరాబాద్ కెప్టెన్ బంతి వేయకుండా.. మిగతా వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తే బాగుండేది. హైదరాబాద్ కెప్టెన్ బంతి మీద పట్టు కోల్పోవడంతో వైభవ్ రెచ్చిపోయాడు. హైదరాబాద్ కెప్టెన్ ను లక్ష్యంగా చేసుకొని బ్యాటింగ్ చేశాడు. ఊర మాస్ అంటే ఎలా ఉంటుందో లైవ్లో చూపించాడు. సూర్యవంశీని అవుట్ చేయడానికి తాము అనేక ప్రణాళికలు రూపొందించామని హైదరాబాద్ కెప్టెన్ మ్యాచ్ కు ముందు వ్యాఖ్యానించాడు. కానీ అవేవి కూడా వర్కౌట్ కాలేదు. చివరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత.. హైదరాబాద్ కెప్టెన్ ఇప్పుడు చింతించి ఏం ఉపయోగం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular