SRH Vs GT: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా హైదరాబాద్, గుజరాత్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ రెండు జట్లు ఇప్పటివరకు చెరో రెండు మ్యాచ్ లు ఆడాయి. హైదరాబాద్, గుజరాత్ ఒక్కో విజయం సాధించాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా పాయింట్లు పట్టికలో హైదరాబాద్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ ఏడో స్థానంలో చోటు సంపాదించుకుంది. ఇరుజట్లకు మెరుగైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే హైదరాబాద్ జట్టులో క్లాసెన్ పేరు మారుమోగుతోంది. ఐపీఎల్ 17వ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో ఎంతోమంది బ్యాటర్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అయితే వారిలో క్లాసెన్ ప్రత్యేకం. ఎందుకంటే అతడు అత్యుత్తమ స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాటర్లలో మేటిగా ఉన్నాడు. గత సీజన్లో హైదరాబాద్ జట్టు ఇతడిని కొనుగోలు చేసింది.
ఈ సీజన్ లో కోల్ కతా జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో హైదరాబాదును గెలుపు అంచుల వరకు క్లాసెన్ తీసుకెళ్లాడు. ఏకంగా 63 పరుగులు చేసి వారెవ్వా అనిపించాడు. ముంబై ఇండియన్స్ పై 34 బంతుల్లోనే 80 పరుగులు చేసి.. ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు సాధించేలా కీలక పాత్ర పోషించాడు. 2018 లోనే క్లాసెన్ ఐపీఎల్ జర్నీ మొదలైంది. అప్పట్లో రాజస్థాన్ జట్టు ఇతడుని కేవలం 50 లక్షల కొనుగోలు చేసింది. ఆ సీజన్లో ఇతడు పెద్దగా రాణించలేకపోయాడు. నాలుగు మ్యాచ్ లు ఆడి కేవలం 57 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రాజస్థాన్ జట్టు ఇతడిని వదిలేసింది. దీంతో బెంగళూరు జట్టు 2019లో ఇతడిని దక్కించుకుంది. కేవలం మూడు మ్యాచ్ లలో 9 పరుగులు మాత్రమే చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. అప్పుడు కోవిడ్ ప్రబలడంతో డోర్ ని కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇతడని పక్కన పెట్టింది. ఆ తర్వాత మూడు సంవత్సరాలు క్లాసెన్ ఐపీఎల్ లో దర్శనం ఇవ్వలేదు. అయితే ఈ బ్యాటర్ న్ ఏ జట్టూ తీసుకోదని అందరూ అనుకున్నారు. కానీ 2023 లో హైదరాబాద్ జట్టు ఇతడిని ఏకంగా 5.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో ఏమాత్రం ప్రభావం చూపించని ఇతగాడికి అంత ధరా అని అందరూ నోర్లు వెళ్ళబెట్టారు. కానీ వారందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.
గత సీజన్లో పెద్దగా సత్తా చాట లేక పోయాడు. బెంగళూరు తో జరిగిన ఒక మ్యాచ్లో 51 బంతుల్లోనే 100 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. గత సీజన్లో 12 మ్యాచ్ లు ఆడి 448 పరుగులు చేశాడు. హైదరాబాద్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ప్రస్తుత సీజన్లో తొలి రెండు మ్యాచ్ లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడుతూ ప్రత్యర్థి జట్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. గుజరాత్ జట్టుతో మ్యాచ్ సందర్భంగా నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సోషల్ మీడియాలో పంచుకుంది. “ఈరోజు గుజరాత్ జట్టుతో జరిగే మ్యాచ్ మీరు మిస్ కావొద్దు.. క్లాసెన్ క్లాస్ ఇన్నింగ్స్ తో మిమ్మల్ని అలరించడానికి ఆరెంజ్ డ్రెస్ తో సిద్ధంగా ఉన్నాడంటూ” క్యాప్షన్ సిద్ధం చేసింది. దీనిపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు..” క్లాసెన్ ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే గుజరాత్ జట్టుకు మూడినట్టే అని” కామెంట్స్ చేస్తున్నారు.