Sunrisers Hyderabad Loss Reason IPL 2026: ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో ఓడిపోయి హైదరాబాద్ జట్టు విమర్శలను మూట కట్టుకుంటున్నది. ముఖ్యంగా బౌలర్ల ప్రదర్శన అభిమానులకు ఏమాత్రం ఆనందాన్ని కలిగించడం లేదు. 201 పరుగులు చేసినప్పటికీ.. హైదరాబాద్ జట్టు ఓడిపోవడాన్ని అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.. సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి
బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు మొదట్లో మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్, క్లాసెన్ దూకుడు వల్ల 201 పరుగులు చేసింది. వాస్తవానికి ఈ లక్ష్యాన్ని కాపాడుకుంటుందని హైదరాబాద్ ఆటగాళ్ల మీద అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ.. వాటిని ప్లేయర్లు నిలబెట్టుకోలేక పోయారు. ఎక్స్ ట్రా బౌన్స్ కు సహకరిస్తున్న పిచ్ మీద సరైన బంతులు వేయలేక తడబడ్డారు. దీంతో బెంగళూరు బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ముఖ్యంగా రజత్ పాటిదర్, విరాట్ కోహ్లీ అర్థ శతకాలతో అదరగొట్టారు. సొంత మైదానంలో.. భారీగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో దుమ్ము దుమారంగా బ్యాటింగ్ చేశారు.
వాస్తవానికి బెంగళూరు గెలవడానికి ప్రధాన కారణం హైదరాబాద్ బౌలర్లు మాత్రమే కాదు.. ఒక ఆటగాడు వదిలిపెట్టిన క్యాచ్ కూడా.. అతడు ఆ క్యాచ్ వదిలి పెట్టకుండా ఉండి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.. 201 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో.. బెంగళూరు ఓపెనర్ సాల్ట్ అవుట్ అయ్యాడు. ఈ దశలో దేవదత్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 8 ఓవర్లో విరాట్ ఇచ్చిన క్యాచ్ ను క్లాసెన్ జారవిడిచాడు. అప్పటికి విరాట్ స్కోర్ 28 పరుగులు. హర్షల్ పటేల్ వేసిన బంతిని విరాట్ గట్టిగా కొట్టాడు. లాంగ్ ఆన్ లో ఉన్న క్లాసెన్ క్యాచ్ పట్టుకున్నాడు. ఆ తర్వాత జారవిడిచాడు. దీంతో విరాట్ విలువైన జీవాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత చెలరేగి బ్యాటింగ్ చేశాడు. 38 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 69* పరుగులు చేసి తన స్టామినా నిరూపించుకున్నాడు. బెంగళూరు బ్యాటర్లలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఒకవేళ క్లాసెన్ ఆ క్యాచ్ కనక పట్టి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. హైదరాబాద్ బౌలర్లు మాత్రమే కాదు.. క్లాసెన్ నిర్లక్ష్యమైన ఫీల్డింగ్ హైదరాబాద్ జట్టు కొంప ముంచింది.