Rajamouli Ignores Two Heroes: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే ఎవరైనా చెప్పే ఒకే ఒక పేరు రాజమౌళి… ఆయన చేసిన సినిమాలు పెను సంచలనంగా మారడమే కాకుండా ఆయనను టాప్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. అలాంటి దర్శకుడి నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదోక వైవిధ్యభరితమైన ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక ఎలాంటి కథనైన సరే సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించగలిగే కెపాసిటి ఉన్న రాజమౌళి ఎమోషన్ ని సైతం బాగా వాడుకుంటాడు. అందువల్లే అతని సినిమాలకు ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఎంజాయ్ చేస్తుంటారు… ఇక ప్రస్తుతం మహేష్ బాబు తో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని విస్తరించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మొదట ఈ సినిమాకి 1300 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని స్టార్ట్ చేశారు. కానీ మొత్తానికైతే ఈ సినిమా కోసం 1500 కోట్లకు మించి బడ్జెట్ ను పెడుతున్నారట. తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితో సినిమాలను చేసిన రాజమౌళి ఒక ఇద్దరు స్టార్ హీరోలను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది. ఇక వాళ్లతో సినిమాలు చేసే అవకాశం కూడా లేకపోయినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విషయంలో రాజమౌళి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కెరియర్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని రాజమౌళి తీవ్రమైన ప్రయత్నం చేశాడు.
Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి
అయిన కూడా అది కార్యరూపం దాల్చలేదు. కారణం ఏంటి అంటే ఈయన కథ చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా బిజీ షెడ్యూల్స్ లో ఉండడం వల్లే రాజమౌళి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేకపోయాడట. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ తో రాజమౌళి సినిమా చేయలేడు. అందుకే అతన్ని పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది…ఇక ఇప్పటి వరకు అల్లు అర్జున్ తో కూడా సినిమా చేయలేదు.
కానీ తొందర్లోనే ఆయనతో ఒక సినిమా చేయడనికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక రాజమౌళి తన కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్టీఆర్ తో వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పటికే వీళ్ళ కాంబోలో 4 సినిమాలు వచ్చాయి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను సైతం పక్కన పెట్టేసారట.
అతనితో ఇప్పటికే నాలుగు సినిమాలు చేశాడు. ఇక ఎప్పుడు అతనితోనే చేస్తే ప్రేక్షకులకు రొటీన్ గా అనిపిస్తుందని ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఈ మధ్యకాలంలో సినిమాలైతే చేయాడట. ఇక ఇప్పుడప్పుడే వీళ్ళ కాంబో లో సినిమా వచ్చే అవకాశమైతే లేదు…