https://oktelugu.com/

ధనిక రాష్ట్రం తెలంగాణ బడ్జెట్ ఇంతేనా?

కరోనా దెబ్బకు దేశ, రాష్ట్ర ఆదాయం కాస్త పూర్తిగా పడిపోయింది. ఆదాయాలు లేక రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మాత్రం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నెట్టుకురావాల్సిన దుస్థితి వచ్చింది. అయితే.. ఏటా ఎంతో ఆర్భాటంగా తయారుచేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈసారి రూ.50 వేల కోట్లు తగ్గుతోంది. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ ఆర్థిక స్థితి, బడ్జెట్‌, ఇతర శాఖలకు నిధుల కేటాయింపుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 10:34 AM IST
    Follow us on

    కరోనా దెబ్బకు దేశ, రాష్ట్ర ఆదాయం కాస్త పూర్తిగా పడిపోయింది. ఆదాయాలు లేక రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మాత్రం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నెట్టుకురావాల్సిన దుస్థితి వచ్చింది. అయితే.. ఏటా ఎంతో ఆర్భాటంగా తయారుచేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈసారి రూ.50 వేల కోట్లు తగ్గుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఆర్థిక స్థితి, బడ్జెట్‌, ఇతర శాఖలకు నిధుల కేటాయింపుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌. కరోనా వల్ల పడిపోయిన ఆదాయానికి తగ్గట్లుగా బడ్జెట్‌ను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పులు చేసి కేటాయించడం కన్నా బడ్జెట్‌ను తగ్గించుకోవడం మంచిదన్న అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. గత మార్చిలో 2020–-21 ఏడాదికి రూ.1.82 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను ఆమోదించారు. అప్పట్లో ఆదాయాలను వాస్తవికంగానే అంచనా వేశారు. గతంలో రెండు లక్షల కోట్లకు దాటిపోయిన అంచనాలను తగ్గించారు.

    Also Read: పార్టీ మార్పుపై స్పందించిన విజయశాంతి

    వాస్తవిక అంచనాలను కూడా కరోనా మరింత కుందదీసింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రాష్ట్ర ఖజానాకు వచ్చిన ఆదాయం రూ.55,782 కోట్లు మాత్రమే. పైగా ఇందులో రూ.24,719 కోట్లు రుణాలు. ఆదాయంలో 40 శాతానికి పైగా అప్పుల ద్వారా వచ్చినవే. ఖర్చు రూ.53,313 కోట్లుగా లెక్క తేలింది. అయితే మొదటి ఆరు నెలల కాలంలో అత్యధికం లాక్ డౌన్‌లో అమలైంది. దీంతో వ్యాపార వ్యవహారాలు.. కార్యకలాపాలు జరగలేదు. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది. వచ్చే ఆరు నెలల్లో అంచనా వేసిన ఆదాయం వస్తుందని.. అధికారులు భావిస్తున్నారు. భూముల విక్రయం ద్వారా రూ.30 వేల కోట్ల మేర సమకూర్చుకోవాలని బడ్జెట్‌లో నిర్ణయించారు. కానీ.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. వచ్చే ఆరు నెలల్లో రూ.70 వేల కోట్ల మేర ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులోనూ ఓ రూ.20వేల కోట్ల వరకూ అప్పులు ఉండవచ్చు. ఎలా చూసినా.. మొత్తం బడ్జెట్‌ రూ.1.30 లక్షల కోట్లకే పరిమితం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    Also Read: ముప్పు తప్పదు: కరోనా ఇక తగ్గే అవకాశాలు తక్కువేనా..!

    మరోవైపు ఫ్లాగ్‌ షిప్‌ పథకాలకు మాత్రం పైసా తగ్గకుండా కేటాయించాలని చూస్తున్నారు. పింఛన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించక తప్పదు. అలాగే యాసంగికి సంబంధించిన రైతుబంధు నిధులనూ రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిందే. వీటికి నిధులు సర్దుబాట చేయక తప్పదు. వీటికి ప్రాధాన్యత ఇచ్చి ఇతర రంగాలకు కోత విధించే అవకాశం ఉంది. దీనిపై కేసీఆర్ రెండు రోజులపాటు సమీక్షలు చేసి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.