IPL 2023: పరాక్రమ్‌వి అనుకుంటే ఇలా నిరాపశరుస్తున్నావేంటి మార్‌క్రమ్‌?

IPL 2023 – aiden markram  : సింహరాశి సినిమా చూశారా? అందులో పెళ్లి చూపులు సీన్‌ ఉంటుంది. పెళ్లి కుమార్తె అలా వచ్చి ఇలా మెరుపుతీగలాగా వెళ్లిపోతుంది. పెళ్లి చూపులకు వచ్చిన బ్రహ్మానందం ఒక్కసారి హతాశుడవుతాడు. ఇప్పుడు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు యజమాని కావ్య మారన్‌ పరిస్థితి కూడా అలానే ఉంది. అంతకుముందు సీజన్‌లో అట్టడుగును ఉంది. గత ఏడాది ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాదయినా రాణిస్తుంది అనుకుంటే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ […]

Written By: Bhaskar, Updated On : April 8, 2023 10:34 pm
Follow us on

IPL 2023 – aiden markram  : సింహరాశి సినిమా చూశారా? అందులో పెళ్లి చూపులు సీన్‌ ఉంటుంది. పెళ్లి కుమార్తె అలా వచ్చి ఇలా మెరుపుతీగలాగా వెళ్లిపోతుంది. పెళ్లి చూపులకు వచ్చిన బ్రహ్మానందం ఒక్కసారి హతాశుడవుతాడు. ఇప్పుడు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు యజమాని కావ్య మారన్‌ పరిస్థితి కూడా అలానే ఉంది. అంతకుముందు సీజన్‌లో అట్టడుగును ఉంది. గత ఏడాది ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాదయినా రాణిస్తుంది అనుకుంటే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలయింది. పది జట్లు ఉన్న ఐపీఎల్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నది. వరుస ఓటములతో బేల చూపులు చూస్తోంది.

వాస్తవానికి ఐపీఎల్‌లో హైదరాబాద్‌ జట్టు కూర్పు బాగుండటం లేదు. ఇది గత కొన్ని సీజన్లలో కన్పిస్తోంది. దీంతో ఆ జట్టు యజమానికి కావ్య మారన్‌ను ‘బ్యూటీ విత్‌ నో బ్రెయిన్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెరుగ్గా రాణించే క్రీడాకారులను కోల్పోయిన జట్టు… అంతంతమాత్రంగా ప్రతిభ చూపే ఆటగాళ్లతో కప్‌ ఎలా కొడుతుందని ప్రశ్నిస్తున్నారు. వారి వ్యాఖ్యల తగ్గట్టుగానే జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ఉంటోంది. మొదటి మ్యాచ్‌లో అయితే హైదరాబాద్‌ జట్టు ఆడిన తీరు దారుణాతీదారుణం. సొంత మైదానంలో ఆడిన ఆ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో దారుణమైన ఓటమిపాలయింది.

మొదటి ఓటమి తర్వాత సమూల మార్పులు చేపడుతున్నామని హైదరాబాద్‌ జట్టు యాజమాన్యం ప్రకటించింది. చెప్పినట్టుగానే జట్టులోకి మార్కక్రమ్‌ అనే ఆటగాడిని తీసుకొచ్చింది. ఇతడిని హైదరాబాద్‌ జట్టు వేలంలో రెండు కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. బ్యాట్‌తో వీరవిహారం చేస్తాడు, హైదరాబాద్‌ రాత మారుస్తాడని యాజమాన్యం రెండో మ్యాచ్‌కు ముందు గొప్పలు పోయింది. కానీ తీరా చూస్తే మార్‌క్రమ్‌ ఆట తీరు తేలిపోయింది. లక్నోతో జరిగిన రెండో మ్యాచ్‌లో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. జస్ట్‌ ఇలా వచ్చి ఆలా వెళ్లిపోయాడు. లక్నోతో జరిగిన రెండో మ్యాచ్‌లో క్రునాల్‌ బౌలింగ్‌లో డక్ఔటయ్యాడు. పైగా ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు కేవలం 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. అది కూడా అన్ని ఓవర్లు ఆడి. ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో ఓ జట్టు చేసిన అత్యల్ప స్కోర్‌ ఇదే. ఈ విజయలక్ష్యాన్ని లక్నో జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. మరి హైదరాబాద్‌ ఆట తీరు ఎప్పుడు మారుతుందో ఏమిటో? ఈసారి కూడా పాయింట్ల పట్టికలో కింది స్థానానికే పరిమితం అవుతుందా హైదరాబాద్‌ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఇక ఈమ్యాచ్‌లో మార్‌క్రమ్‌ డకౌట్‌ అయిన విధానంపై నెటిజన్లు రకరకాలుగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘కావ్య పాప నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా వమ్ము చేస్తావా అంటూ’ మార్‌క్రమ్‌ను ఏకిపారేస్తున్నారు.