Sunil Narine : వరుసగా రెండో ఓటమితో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఒకానొక దశలో ఢిల్లీ జట్టు విజయం వైపు ప్రయాణం సాగించినప్పటికీ.. సునీల్ నరైన్ దూకుడు వల్ల మూడు వికెట్లు కోల్పోయింది.. దీంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ కతా.. 9 వికెట్లు లాస్ అయిపోయి.. 204 పరుగులు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగుల వద్దే ఆగిపోయింది. ఫాఫ్ డూ ప్లెసిస్ అదరగొట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అక్షర్ పటేల్ తన వంతు దూకుడు కొనసాగించినప్పటికీ.. అది ఢిల్లీ విజయానికి తోడ్పడలేక పోయింది. వీరిద్దరి కలయికలో ఢిల్లీ జట్టు గెలుపు దిశగా సాగుతున్నట్టు కనిపించినప్పటికీ.. సునీల్ నరైన్ రాకతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇతడు డూ ప్లెసిస్, అక్షర్ పటేల్, స్టబ్స్ వికెట్లను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా అక్షర్ పటేల్ ను రన్ ఔట్ చేసి ఒక్కసారిగా మ్యాచ్ ను తమ జట్టు వైపు తిప్పాడు. మూడు వికెట్లు సొంతం చేసుకున్న నరైన్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
Also Read : లక్నో 238 కొట్టినా.. ఇదే హైయెస్ట్ కాదు.. గతంలో ఎవరి మీద చేసిందంటే..
సరికొత్త చరిత్ర
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కు అత్యవసరమైన పరిస్థితుల్లో విజయాన్ని అందించిన సునీల్.. టి20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా అతడు ఆవిర్భవించాడు. 208 వికెట్లతో ఈ జాబితాలో అతడు సమిత్ పటేల్ తో కలిసి తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. నాటింగ్ హంప్ షైర్ జట్టుకు ఆడుతున్న సమిత్ పటేల్ 208 వికెట్లు పడగొట్టి తొలి స్థానంలో ఉన్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున బౌలింగ్ చేస్తున్న సునీల్ నరైన్ 208 వికెట్లు పడగొట్టి అతడి సరసన చేరాడు. ఇక హంప్ షైర్ కౌంటి జట్టుకు క్రికెట్ ఆడుతున్న క్రిస్ వుడ్ 199 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన లసిత్ మాలింగ 195 వికెట్లు సాధించాడు. గ్లూక్ స్టెర్ షైర్ కౌంటి జట్టుకు ఆడిన డేవిడ్ పైన్ 193 వికెట్లు సాధించాడు. మొత్తంగా పురుషుల టి20 క్రికెట్ లో ఏ బౌలర్ కలల కూడా ఊహించని గణాంకాలను సునీల్ నరైన్ నమోదు చేశాడు. ఇప్పటికే 208 వికెట్లతో సంయుక్తంగా తొలి స్థానంలో కొనసాగుతున్న సునీల్.. మరి కొద్ది రోజుల్లో మరిన్ని ఎక్కువ వికెట్లు సాధించి.. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం బంతి ద్వారా మాత్రమే కాకుండా.. బ్యాట్ తో కూడా సునీల్ నరైన్ సంచలనాలు సృష్టిస్తాడు. ఓపెనర్ గా వచ్చి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు భీకరమైన స్కోర్ అందిస్తాడు. అందువల్లే అతడిని అత్యంత ప్రమాదకర ఆటగాడిగా పేర్కొంటారు. అతడు గనుక మైదానంలో కుదురుకుంటే చాలు.. పరుగుల వరద పారుతూ ఉంటుంది. ఎంతటి తోపు బౌలర్ అయినా సరే అతని ముందు తలవంచాల్సి ఉంటుంది.
Also Read : మొన్ననేమో సంతకం.. నేడేమో బంతి.. ఎవడ్రా నువ్వు ఇలా ఉన్నావ్?