Divvela : తెలుగు రాజకీయాల్లో( Telugu politics) సెలబ్రిటీ జంట దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ), దివ్వెల మాధురి. గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో ఈ జంట సృష్టించిన హల్చల్ అంతా ఇంతా కాదు. చివరకు ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారానికి దారితీసింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును వైయస్సార్ కాంగ్రెస్ హై కమాండ్ సస్పెండ్ చేసింది. కుటుంబ వివాదం తెరపైకి రావడం.. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి నిరసనతో వెలుగులోకి రావడం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యత నుంచి తప్పించింది. ఇటీవల మాత్రం ఏకంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
Also Read : పవన్ కళ్యాణ్ పై పోలీసులకు దివ్వెల మాధురి ఫిర్యాదు.. ఏ క్షణంలోనైనా దువ్వాడ అరెస్టు
* వివాదాస్పదంగా..
దువ్వాడ శ్రీనివాస్ తన భార్య పిల్లలను విడిచిపెట్టి.. దివ్వెల మాధురి తో( divyala Madhuri ) సన్నిహితంగా ఉంటున్నారు. త్వరలో తాము వివాహ బంధంతో ఒకటి కానున్నామని ఆ ఇద్దరు చెబుతూ వచ్చారు. సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ సెలబ్రిటీ హోదాను చక్కగానే అనుభవిస్తూ వచ్చారు. మరోవైపు వకులా శారీస్ పేరిట వస్త్ర వ్యాపారంలో సైతం అడుగుపెట్టారు. ఈ తరుణంలోనే దువ్వాడ శ్రీనివాస్ రాజకీయాల నుంచి సైడ్ అవుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇంకోవైపు ఇటీవల ఇంటర్వ్యూలో నారా లోకేష్ కు అనుకూలంగా వ్యాఖ్యానించారు. అందుకే వైసిపి హై కమాండ్ దువ్వాడ శ్రీనివాసులు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
* దువ్వాడ కోసం బంగారం కొనుగోలు..
రాజకీయంగా, వ్యక్తిగతంగా వారికి భారీ డ్యామేజ్ జరుగుతున్న పట్టించుకోవడం లేదు. ఈ జంట ఇంకా మీడియాలో ( media) హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా హైదరాబాదులోని ఓ జ్యువెలరీ షాప్ లో మెరిశారు దివ్వెల మాధురి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా ఆమెను గుర్తించింది. పలకరించగా.. ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బంగారం కొనుగోలుకు వచ్చారా అంటూ ప్రశ్నించగా.. దువ్వాడ శ్రీనివాస్ కోసం బ్రాస్లెట్ కొనుగోలు చేసేందుకు వచ్చానని ఆమె చెప్పారు. తాను ప్రతిక్షణం దువ్వాడ శ్రీనివాస్ కోసమే ఆలోచిస్తానని చాలా సందర్భాల్లో మాధురి చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కోసం బ్రాస్లెట్ కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చానని చెప్పడం… సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీ అభిమానం సల్లగుండ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.
Also Read : తిరుమలలోనూ దువ్వాడ ప్రియురాలు మాధురి అదే పని.. కేసులు పెట్టిన పోలీసులు
* రోజురోజుకు పెరుగుతున్న బంధం..
దువ్వాడ శ్రీనివాస్ వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) నుంచి సస్పెండ్ వెనుక.. దివ్వెల మాధురి వ్యవహార శైలి కారణమన్న కామెంట్స్ ఉన్నాయి. టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ తిలక్ ను ఉద్దేశించి ఆమె పెట్టిన పోస్ట్ వల్లే దువ్వాడ పై వేటు వేశారని ఒక ప్రచారం నడుస్తోంది. పుష్ప డైలాగును అనుసరిస్తూ దమ్ముంటే పట్టుకోరా టిక్కెట్టు.. పట్టుకుంటే వదిలేస్తా సోషల్ మీడియా అంటూ సవాల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ సైతం తన సస్పెండ్ ను పెద్దగా పట్టించుకోలేదు. మాధురి మూలంగా తన పొలిటికల్ కెరీర్ ఇబ్బందుల్లో పడిందని భావించడం లేదు. ఈ జంట మధ్య రోజురోజుకు బాండింగ్ మరింత పెరుగుతోంది.
దువ్వాడ శ్రీనివాస్ కు దివ్వెల మాధురి సర్ ప్రైజ్ గిఫ్ట్
అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ బ్రాస్లెట్ కొనుగోలు
భూముల కంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం ఉత్తమం అంటున్న దివ్వెల మాధురి pic.twitter.com/vzUT4tnCOf
— BIG TV Breaking News (@bigtvtelugu) April 29, 2025