Sunil Gavaskar : నితీష్ కుమార్ రెడ్డి సూపర్ సెంచరీ చేయడం ద్వారా టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాడు, భారత జట్టు మాజీ కోచ్ రవి శాస్త్రి కన్నీటి పర్యంతమయ్యాడు. కామెంట్రీ బాక్స్ లో ఉన్న అతడు మాట కూడా మాట్లాడకుండా.. అలానే చూస్తూ ఉండిపోయాడు. ఓవైపు ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతుండగా.. తను అనడానికి ఇంకేం మాటలు లేవని.. అతడు గొప్ప ఆటగాడు అనే విధంగా సంకేతాలు ఇచ్చాడు. అతడు సెంచరీ చేసిన తర్వాత..మెల్ బోర్న్ మైదానంలో జెండా పాతి నట్టు సంకేతాలు ఇవ్వగా.. దాన్ని చూసి రవిశాస్త్రి మురిసిపోయాడు. ఇలాంటి ఆటగాళ్లు కదా టీం ఇండియాకు కావలసింది అన్నట్టుగా సంబరపడిపోయాడు.. మరోవైపు దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సైతం నితీష్ కుమార్ రెడ్డి ఆటకు ఫిదా అయిపోయాడు. అదరగొట్టిన తెలుగు కుర్రాడు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాదు అంతేకాదు నితీష్ కుమార్ రెడ్డి శనివారం ఆట ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వస్తుండగా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాడు సునీల్ గవాస్కర్.
పాదాల మీద పడిపోయారు
శనివారం రాత్రి భారత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన ముత్యాల రెడ్డి, అతని కుటుంబం.. నితీష్ కుమార్ రెడ్డి ని కలిసింది. అతడిని గుండెలకు హత్తుకుని కంటి నిండా ఏడ్చింది. భావోద్వేగంలో తడిసి ముద్దయింది. ఆ తర్వాత లాబీలో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కనిపించగా.. మరో మాటకు తావు లేకుండా ముత్యాల రెడ్డి, అతని కుటుంబం పాదాల మీద పడి నమస్కరించింది..”థాంక్స్ ఫర్ సపోర్ట్ అవర్ సన్ సార్” అంటూ సునీల్ గవాస్కర్ కు నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాలలో విస్తృతంగా దర్శనమిస్తోంది..” తెలుగు సంస్కృతిని ప్రతిబింబించారు. తెలుగు మర్యాదను రుచి చూపించారు. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా ఉంటారు. వాళ్లు ఏం చేసినా ప్రత్యేకతను చాటుకుంటారు. ఈ దృశ్యమే అందుకు నిదర్శనమని” ఈ వీడియో చూసిన నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.. తెలుగు మర్యాదను చూసి, తెలుగు సంస్కృతిని చూసి సునీల్ గవాస్కర్ హృదయం కూడా ఉప్పొంగిపోయి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. తమ కుమారుడు ప్రయోజకుడు అయ్యాడని.. సునీల్ గవాస్కర్ కూడా అదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారని.. ఆస్ట్రేలియా మీడియాతో ముత్యాల రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సునీల్ గవాస్కర్ ను ముత్యాల రెడ్డి తన కుటుంబంతో కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.. తన కుమారుడిని మరింత ఎత్తుకు ఎదిగేలా దీవించాలని కోరారు.
Nitish Kumar Reddy’s family meeting the Great Sunil Gavaskar. [ABC Sport]
– Beautiful moments at MCG…!!! pic.twitter.com/DEFJpCRSWY
— Johns. (@CricCrazyJohns) December 29, 2024