MSK Prasad : మెల్ బోర్న్ మైదానంలో సెంచరీ సాధించి.. టీమిండియాను తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్న విషయం తెలిసిందే. అతడు చేసిన సూపర్ సెంచరీ ద్వారా టీమిండియా మెల్ బోర్న్ టెస్ట్ పై పట్టు బిగించింది. నితీష్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఉత్సాహంతో టీమిండియా బోర్డర్లు రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా పై తమ సత్తా చాటుతున్నారు. టీమిండియా బౌలర్ల ధాటికి ఇప్పటికే ఆస్ట్రేలియా ఆరు కీలకమైన వికెట్లు కోల్పోయింది. హెడ్, కోన్ స్టాస్, మార్ష్, స్మిత్, ఖవాజా వంటి వారు పెవిలియన్ చేరుకున్నారు. లబూ షేన్(61*), కమిన్స్(22*) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. భారత బౌలర్ల జోరు చూస్తుంటే ఆస్ట్రేలియాను 200 లోపు ఆల్ అవుట్ చేసేలా కనిపిస్తున్నారు. భారత బౌలర్లు ఇలా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం నితీష్ కుమార్ రెడ్డి చూపించిన తెగువ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. టీమిండియా 220 పరుగుల లోపే ఏడు వికెట్లు కోల్పోయిన సమయంలో.. వాషింగ్టన్ సుందర్ తో కలిసి 120 కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పే..మ్యాచ్ ను ఇండియా చేతుల్లోకి తెచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి. హాఫ్ సెంచరీ చేసి తగ్గేది లేదు అని నిరూపించిన అతడు.. సెంచరీ చేసి మెల్ బోర్న్ మైదానంలో జెండా పాతాం అని నిరూపించాడు. అయితే అటువంటి ఆటగాడిని ఎంపిక చేయడం వృధా అని ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు.
ఎందుకు ఎంపిక చేశారు
ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా బాక్సింగ్ డే టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి ని ఎంపిక చేయడం పట్ల ఎమ్మెస్కే ప్రసాద్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. గిల్ ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని.. అతడిని రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసి తప్పిదం చేశారని వ్యాఖ్యానించాడు. అయితే ఎమ్మెస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు..” నీ అకాడమీలో కదా ట్రైన్ అయింది.. ఇవాళ ఇంత స్థాయికి ఎదిగాడు. కష్టాలను దిగమించుకొని.. కన్నీళ్లను అధిగమించి ఇంతటి పేరు తెచ్చుకున్నాడు. అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే. గొప్ప గొప్ప ఆటగాళ్లు కూడా సాధించ లేని లక్ష్యాన్ని అతడు చేరుకున్నాడు. అటువంటి ఆటగాడిని తక్కువ చేసి మాట్లాడతావా.. తెలుగు వాళ్ళంటే నీకు ఎందుకు అంత అలసు. అంబటి రాయుడు, హనుమ విహారి విషయంలో చేసింది సరిపోలేదా.. ఇప్పుడు ఇతడి మీద పడ్డావా..” అంటూ నెటిజన్లు ఎమ్మెస్కే ప్రసాద్ మీద మండిపడుతున్నారు. అయితే సెంచరీ చేసిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డిని ప్రసాద్ అభినందించడం విశేషం. నాడు అతని కెరియర్ సరైన ట్రాక్లో పడటంలో తన పాత్ర కూడా ఉందని ప్రసాద్ వ్యాఖ్యానించడం గమనార్హం.
MSK PRASAD ( Clown of a Century ) , He Never Wants Our Andhra or Telangana Players In Indian Squad , Thanks To Nitish Kumar Reddy For Proving Him Wrong , Let’s Laugh At Clown MSK PRASAD , Hahahaha pic.twitter.com/2HdoIjIzr0
— Clashing Universe (@clashing005) December 28, 2024