Sunil Gavaskar: నిన్న ఇండియా సౌతాఫ్రికా టీమ్ ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.టాస్ వేయడానికి ముందు నుంచే విపరీతంగా వర్షం పడడంతో టాస్ వేయడం కాస్త లేట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎడతెరిపి లేకుండా కురవడం తో టాస్ వేయకుండానే ఆపేశారు. దాంతో చాలామంది వర్షం కురవడం ఆగక కొన్ని ఓవర్ల తో అయిన మ్యాచ్ జరుగుతుందేమో అని అనుకున్నారు.
అయినప్పటికీ పిచ్ మొత్తం వర్షంతో తడిసిపోవడంతో మ్యాచ్ ను రద్దు చేసినట్టు గా ప్రకటించారు. అయితే ఈ విషయం మీద ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ ప్లేయర్ అయిన సునీల్ గవాస్కర్ స్పందిస్తూ దక్షిణాఫ్రికా బోర్డు పైన తీవ్రమైన విమర్శలు చేశాడు. పిచ్ ని వర్షం టైం లో కవర్ చేయడానికి కవర్లు కూడా మీ దగ్గర లేవా ఫీల్డ్ మొత్తాన్ని కవర్ చేస్తే మ్యాచ్ టైం లో ఫీల్డర్ అవుట్ సైడ్ లో ఫీల్డింగ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక పిచ్ మొత్తం తడిగా ఉంటే అతడు ఫీల్డింగ్ ఎలా చేస్తాడు. ఇలాంటి మినిమం ఆలోచన లేకుండా ఎలా వ్యవహరిస్తారు అంటూ సౌతాఫ్రికా బోర్డ్ పైన మండిపడ్డాడు
అయితే సౌతాఫ్రికా బోర్డు దగ్గర కవర్లు కప్పడానికి కూడా డబ్బులు లేవు అనే విషయాన్ని మాత్రం చెప్పకండి.
ఎందుకంటే ప్రతి బోర్డ్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి.బిసిసిఐ తో పోల్చుకుంటే మిగతా బోర్డ్ ల దగ్గర కొంచెం తక్కువ మనీ ఉన్నప్పటికీ కవర్లు కప్పడానికి కూడా డబ్బులు లేనంత దినస్థితిలో మాత్రం ఏ బోర్డు లేదు అంటూ తనదైన రీతిలో ఘాటుగా విమర్శించాడు…ఇక 2019వ సంవత్సరంలో వరల్డ్ కప్ అడుస్తున్నపుడు కూడా ఇంగ్లాండ్ బోర్డ్ ఇదే వైఖరిని కనబరిచింది. దీనివల్ల కొన్ని టీమ్ లు నష్టపోయాయి.ముఖ్యంగా సౌతాఫ్రికా, వెస్టిండీస్ టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో పిచ్ మొత్తం కవర్లతో కప్పకపోవడం వల్ల వర్షం తగ్గిన కూడా ఔట్ ఫీల్డ్ మొత్తం తడిసి ఉండటం వల్ల ఆ మ్యాచ్ పూర్తిగా జరగలేదు దానితో అప్పుడు ఆ మ్యాచ్ రద్దు అయింది.
ఆ టైం లో రెండు టీమ్ లు కూడా భారీగా నష్టపోయాయి. అవుట్ ఫిల్డ్ మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచకపోవడం వల్ల ఒకవేళ వర్షం కురవడం ఆపేసిన కూడా గంట వరకు పిచ్ లో మ్యాచ్ జరగడం కుదరదు. ఇక అప్పుడు ఆ మ్యాచ్ లు ఆడడానికి టైం ఉండదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దక్షిణాఫ్రికా బోర్డు తన వైఖరిని మార్చుకుని ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేయకుండా ఉంటే మంచిది అంటూ సునీల్ గవాస్కర్ ని తీవ్రంగా విమర్శించాడు…