Sunil Chhetri
Sunil Chhetri: క్రికెట్ ఫీవర్ తో ఊగిపోతున్న భారత దేశంలో.. ఫుట్ బాల్ అనే విశ్వవ్యాప్త క్రీడకు ఊపు తీసుకొచ్చినవాడు సునీల్ చెత్రి. దశాబ్దలకాలంగా టీమిండియా ఫుట్ బాల్ కు దశ, దిశ సునీల్ అనడంలో అతిశయోక్తి లేదు. వయసు పైబడుతున్నా.. శరీరంలో సత్తువ కోల్పోతున్నప్పటికీ.. అతడు ఫుట్ బాల్ విషయంలో మాత్రం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు.
Also Read: ఆదివారం న్యూజిలాండ్ జట్టుతో CT ఫైనల్.. భయపడిపోతున్న టీమిండియా అభిమానులు.. కారణమేంటంటే..
భారత ఫుట్ బాల్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన చరిత్ర సునీల్ ది. అందువల్లే అతడు టీమిండియా రోనాల్డోగా పేరుపొందాడు. అతడి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎంతోమంది క్రీడాకారులు ఫుట్ బాల్ లో సత్తా చూపించారు. నేటికీ టీమిండియా కు ఆడుతూనే ఉన్నారు. అయితే వయసు పై పడటం.. ఒకప్పటిలాగా సత్తువ లేకపోవడంతో సునీల్ ఫుట్ బాల్ కు వీడ్కోలు పలికాడు. దీంతో భారత ఫుట్ బాల్ జట్టు అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సునీల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. అయితే ఇన్నాళ్లకు సునీల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీంతో భారత ఫుట్ బాల్ జట్టుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
వెనక్కి తీసుకున్నాడు
రిటైర్మెంట్ నిర్ణయం పై సునీల్ ఒక అడుగు వెనక్కి వేశాడు. ప్రస్తుతం 40 సంవత్సర వయసులో ఉన్న ఈ ఆటగాడు.. గత ఏడాది జూన్ నెలలో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇండియా తరఫున 151 మ్యాచ్ లలో సునీల్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇందులో అతడు 94 గోల్స్ చేశాడు. గత ఏడాది జూన్ నెలలో రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. సునీల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇక ఈ నెలలో జరిగే FIFA ఇంటర్నేషనల్ మ్యాచ్లో భారత జట్టుకు అతడు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇదే విషయాన్ని ఇండియన్ ఫుట్ బాల్ టీం వెల్లడించింది. ” టీమిండియా ఫుట్ బాల్ కు మంచి రోజులు వచ్చినట్టే. సునీల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. గత జూన్ నెలలో అతడు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పుడు ఎంతమంది ఆటగాళ్లు నిర్వేదానికి గురయ్యారు. ఇక అభిమానుల విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే 40 ఏళ్ల వయసులో సునీల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అతనికి 40 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ శరీర సామర్థ్యం విషయంలో ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలాగే ఉన్నాడు. అందువల్లే ఈ నెలలో జరిగే ఫిఫా ఇంటర్నేషనల్ మ్యాచులలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి సునీల్ తహతహలాడుతున్నాడు. అతడి ఆధ్వర్యంలో ఆడేందుకు యువ ఆటగాళ్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే టీమిండియా ఫుట్ బాల్ కు మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తోంది. సునీల్ సారధ్యంలో ఇంకా అనేక మంది క్రీడాకారులు తమ ప్రతిభకు.. సామర్థ్యానికి పదును పెట్టుకుంటారని భావిస్తున్నాం. ఇందుకు తగ్గట్టుగా సౌకర్యాలు కూడా కల్పిస్తామని” ఇండియన్ ఫుట్ బాల్ టీం వెల్లడించింది.
Also Read: న్యూజిలాండ్ తో ఫైనల్ పోరు.. రోహిత్ సేన ఈ తప్పులు చేయొద్దు..