Champions Trophy 2025 Final: 2017లో నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ వెళ్ళింది. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. తద్వారా కోట్లాదిమంది భారత అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. దాయాది జట్టు చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈసారి వచ్చే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓదెలకూడదని టీమిండియా క్రికెటర్లకు గట్టిగా చెప్పారు.
Also Read: న్యూజిలాండ్ తో ఫైనల్ పోరు.. రోహిత్ సేన ఈ తప్పులు చేయొద్దు..
2017 తర్వాత దాదాపు 8 సంవత్సరాల గ్యాప్ అనంతరం పాకిస్తాన్ వేదికగా ఐసీసీ నిర్వహిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ వెళ్ళింది. సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి.. దర్జాగా ఫైనల్ వెళ్ళింది. 2017 లోనూ టీమిండియా ఫైనల్ వెళ్ళింది.. ఇక ఇదే సమయంలో సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ను 50 పరుగుల తేడాతో ఓడించిన న్యూజిలాండ్ జట్టు కూడా ఫైనల్ చేరుకుంది. భారత్ – న్యూజిలాండ్ జట్లు 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరుకున్నాయి. నాడు న్యూజిలాండ్ జట్టు ఉత్కంఠ పరిస్థితుల మధ్య విజయం సాధించింది. అయితే నాటి ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమ్ ఇండియా ప్రస్తుతం తహతహలాడుతోంది. ఆటగాళ్లు మొత్తం దుబాయ్ వేదికగా తీవ్రంగా సాధన చేస్తున్నారు. షమీ నుంచి మొదలుపెడితే జడేజా వరకు నెట్స్ లో చెమటోడ్చుతున్నారు. ఎలాగైనా సరే న్యూజిలాండ్ జట్టును ఓడించాలని ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నారు. అయితే న్యూజిలాండ్ జట్టుతో ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగుతుండడం టీమిండియా అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నది.
ఆదివారం భయం
టీమిండియా – న్యూజిలాండ్ ఆదివారం చాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆడనున్నాయి. అయితే ఆదివారం భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుండడం అభిమానులను భయపెడుతోంది. ఇప్పటివరకు నిర్వహించిన ఐసీసీ ట్రోఫీలలో ఆదివారం తప్ప.. మిగతా అన్ని రోజులలో నిర్వహించిన ఫైనల్స్ లో భారత్ విజయం సాధించింది. 1983 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్ – వెస్టిండీస్ మధ్య శనివారం జరిగింది. నాటి మ్యాచ్లో భారత్ గెలిచింది. ఇక 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ సోమవారం జరిగింది.. నాటి మ్యాచ్లో భారత్ – శ్రీలంక జట్లను ఐసీసీ సంయుక్త విజేతలుగా ప్రకటించింది. ఇక 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ శనివారం జరిగింది. ఈ మ్యాచ్ భారత్ – శ్రీలంకల మధ్య జరగగా.. భారత్ ఘనవిజయం సాధించింది. 2013 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ టీమిండియా – ఇంగ్లాండ్ మధ్య జరిగింది. అలాంటి మ్యాచ్లో టీమిండియా గెలిచింది.. ఇక 2024 టి20 వరల్డ్ కప్ శనివారం జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా దక్షిణాఫ్రికా పై 12 పరుగుల తేడాతో విక్టరీ సొంతం చేసుకుంది. ఇక 2000 సంవత్సరంలో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. నాటి మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. 2014లో టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. నాటి మ్యాచ్లో శ్రీలంక టీమిండియా పై విజయం సాధించింది.2017లో Champions trophy ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. నాటి మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. నాటి మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఇక 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగింది. నాటి మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఇక ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. ఈ టోర్నీ ఆదివారం జరుగుతున్న నేపథ్యంలో టీమిండి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గత పరిణామాలను దృష్టిలో ఉంచుకొని.. టీమిండియా ఆటగాళ్లు గట్టిగా ఆడాలని కోరుకుంటున్నారు.
Also Read: షమీని సరే.. ఆ పాకిస్తాన్ క్రికెటర్లను పట్టించుకోరా? ఎందుకు నిలదీయరు?