Homeక్రీడలుMahendra singh Dhoni: ఇలాంటి అద్భుతాలు ధోనీకే సాధ్యం.. జార్ఖండ్ డైనమైట్‌పై సర్వత్రా ప్రశంసలు

Mahendra singh Dhoni: ఇలాంటి అద్భుతాలు ధోనీకే సాధ్యం.. జార్ఖండ్ డైనమైట్‌పై సర్వత్రా ప్రశంసలు

Mahendra singh Dhoni: టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎవరు అని అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అందరూ ధోనీ పేరే చెప్తారు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించడంతో పాటు టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంకును సాధించిపెట్టాడు. అయితా ఈ ఘనత ధోనీ ఒక్కడిదే కాదు.. జట్టు మొత్తానిది. ధోనీ హయాంలో జట్టులో సీనియర్ ఆటగాళ్లు కూడా ఉండేవాళ్లు. సాధారణంగా జట్టులో సీనియర్లు ఉన్నప్పుడు జూనియర్లు ఇబ్బంది పడుతుంటారు.

Mahendra singh Dhoni
Mahendra singh Dhoni

కానీ ధోనీ టీమిండియా జట్టును తనదైన శైలిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నడిపించాడు. సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్, గంభీర్, యువరాజ్ లాంటి ఆటగాళ్లకు గౌరవం కల్పిస్తూనే రైనా, అశ్విన్, జడేజా, షమీ, బుమ్రా, రోహిత్, కోహ్లీ లాంటి యువ ఆటగాళ్లను ముందుండి నడిపించాడు. అయితే క్రికెట్‌లో ధోనీ కంటే గొప్ప కెప్టెన్‌లు ఎంతో మంది ఉన్నా అతడిలోని ఓ లక్షణమే వెరీ వెరీ స్పెషల్ అనిపించుకునేలా చేసింది. అదే ఓ ఆటగాడికి సరిపడా అవకాశాలను ఇవ్వడం.

Also Read: KGF Garuda: కేజీఎఫ్2 విలన్ ‘గరుడ’గా నటించింది అసలు ఎవరో తెలిస్తే అవాక్కవుతారు

ఉదాహరణకు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌నే తీసుకుంటే చెన్నై సూపర్‌కింగ్స్ బౌలింగ్ బలహీనంగా ఉంది అని కామెంట్లు వినిపించినా ధోనీ అవేమీ పట్టించుకోకుండా ఓ యువ బౌలర్‌కు పదే పదే అవకాశాలు కల్పించాడు. ఆ బౌలర్ ఎవరో కాదు ముఖేష్ చౌదరి. పేరుకు సీఎస్‌కే కెప్టెన్ జడేజా అయినా తెర వెనుక నడిపిస్తోంది ధోనీనే. దీంతో యువ బౌలర్ ముఖేష్‌కు ధోనీ ఎక్కువ అవకాశాలను ఇచ్చాడు. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ మినహాయిస్తే మిగతా ఆరు మ్యాచ్‌లలోనూ ముఖేష్ చౌదరి ఆడాడు. ఆరంభ మ్యాచ్‌లలో ముఖేష్ దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు.

Mahendra singh Dhoni
Mahendra singh Dhoni, Mukesh Choudhary

అయినా ముఖేష్ చౌదరిపై ధోనీ తన నమ్మకాన్ని సడలించలేదు. ముఖేష్ బేసిక్‌గా స్వింగ్ బౌలర్. వికెట్లకు రెండు వైపులా బంతిని మంచి స్వింగ్ చేయగలడు. ఈ కారణంతోనే వరుసగా నాలుగు మ్యాచ్‌లలో విఫలమైనా ధోనీ అతడికి అవకాశాలు ఇచ్చాడు. ఫైనల్‌గా ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ముఖేష్ అదరగొట్టాడు. వరుసగా రోహిత్, ఇషాన్, బ్రేవిస్ లాంటి ఆటగాళ్ల వికెట్లను దక్కించుకున్నాడు. టీమిండియాకు సంబంధించి యువ ఆటగాళ్ల విషయంలో ఇదే మంత్రాన్ని ధోనీ పాటించాడు కాబట్టే విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: Vasireddy Padma: వియవాడ గ్యాంగ్ రేప్ పరామర్శకు వచ్చిన వాసిరెడ్డి పద్మకు సాకిచ్చిన మహిళలు

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular