Janhvi Kapoor: స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఒక కొత్త సినిమా ‘జన గణ మన’ మొదలైన సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు జాన్వీ దగ్గరకు వెళ్లాయి. అమ్మడు తాజాగా క్లారిటీ ఇచ్చింది. జాన్వీ మాటల్లోనే ‘పుకార్లను నమ్మకండి. నేనిప్పటివరకు ఏ తెలుగు సినిమాను ఓకే చేయలేదు. ఒకవేళ ఏదైనా సినిమాకు సంతకం చేస్తే తప్పకుండా చెప్తా’ అని తెలిపింది.

దీంతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనని స్పష్టం అయ్యింది. ఇక ఈ ‘జన గణ మన’ సినిమాను కాశ్మీర్ నేపథ్యంగా తీస్తున్నాడు పూరి. అంటే, సినిమా మొత్తం కాశ్మీర్ లో ఉండదు. కొంత భాగం అక్కడ ఉంటుంది. ఈ సినిమాలో మిలిటరీ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తాడని.. విజయ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. కథలో మెయిన్ పాయింట్ విషయానికి వస్తే..
Also Read: KGF Garuda: కేజీఎఫ్2 విలన్ ‘గరుడ’గా నటించింది అసలు ఎవరో తెలిస్తే అవాక్కవుతారు
కాశ్మీర్ లో ప్రేమలో పడి, అక్కడే పెళ్లి చేసుకుంటాడట హీరో. అయితే.. ఆ యువతి పాకిస్తాన్ కి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఈ హీరోయిన్ పాత్రలో జాన్వీ కపూర్ నటించనుంది. జాన్వీ కపూర్ తో ఇంతకుముందు విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయాల్సింది. అదే లైగర్. కానీ ఆ సినిమా మిస్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాలో ఇద్దరూ లవర్స్ గా నటిస్తున్నారు.

మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ పాత్ర కోసం ఇప్పటికే మిలిటరీ కటింగ్ చేయించుకున్నాడు విజయ్ దేవరకొండ. అన్నట్లు, పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ కలయికలో వస్తోన్న ఈ చిత్రంలో విజయ్ లుక్ చాలా వైల్డ్ గా ఉంటుందట. మధ్యలో మిలిటరీ కటింగ్ తోనే విజయ్ దేవరకొండ కనిపించినా సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడట.
ఇక ఇప్పటికే ఈ ‘జనగణమన’ నుంచి వచ్చిన పోస్టర్ చాలా బాగుంది. పోస్టర్ వ్యూ అండ్ కలర్ టోన్ అండ్ మూవీ కాన్సెప్ట్ తాలూకు విజువల్ సెన్స్ బాగున్నాయి. పైగా భయంకరమైన యుద్ధ వాతావరణంలో శత్రువులను అంతమొందించేందుకు నింగి నుంచి భారత సైనికులు నేలకు దూకుతున్న దృశ్యాలతో తొలి పోస్టర్ ను డిజైన్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read:Mike Tyson: వైరల్ వీడియో: విసిగించిన అభిమానిని విమానంలో చితక్కొట్టిన మైక్ టైసన్
Recommended Videos:
[…] […]
[…] […]
[…] Pooja Hegde: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’. క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ‘పూజా హెగ్డే’కి ఐటమ్ సాంగ్స్ కొత్తేమి కాదు. ‘రంగస్థలం’ సినిమాలో పూజా ‘జిగేల్ రాణి’ అంటూ ఓ ఐటమ్ పాట చేసింది. అయితే, ఆ సినిమా తర్వాత ‘పూజా హెగ్డే’ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో డబుల్ అయ్యింది. దాంతో.. అమ్మడు ఇక మళ్లీ ఐటమ్ పాటల జోలికి పోలేదు. కానీ ‘ఎఫ్ 3’ కోసం చేసింది. […]