Subhaman Gill : ఓ ఫ్రెంచ్ సామెతకు తెలుగు అనువాదం అది. ఇది ఇప్పుడు టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే చిన్న వయసులోనే టీమ్ ఇండియా టెస్ట్ దళానికి నాయకత్వం వహించే బాధ్యత అతడికి లభించింది. సహజంగానే అతడిలో కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. జట్టు కోసం ఎలాంటి ఇబ్బంది అయినా అతడు ఎదుర్కొంటాడు. ఇబ్బందుల్లోనూ నిలబడతాడు. ఆపద్బాంధవుడు పాత్ర పోషిస్తుంటాడు. అంతేకాదు తనదైన ఫీల్డింగ్ నైపుణ్యంతో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంటాడు. అందువల్లే గిల్ వైపు టీమిండియా మేనేజ్మెంట్ మొగ్గు చూపించింది. అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. తద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలో యువ శకానికి మేనేజ్మెంట్ దారులు పరిచింది.
Also Read : ఝార్ఖండ్ వెళతా.. బైక్ రైడింగ్ ఎంజాయ్ చేస్తా.. రిటైర్ మెంట్ పై ధోని సంచలన ప్రకటన!
గిల్ పై నాయకత్వ బాధ్యతలు అతనిపై ఒత్తిడి పెంచుతున్నాయేమోనని అనుమానాన్ని క్రికెట్ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గిల్ ను టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా నియమించే విషయం అతడికి ఎప్పటినుంచో జట్టు మేనేజ్మెంట్ పరోక్షంగా చెబుతూనే ఉంది. ఐపీఎల్ తాత్కాలికంగా వాయిదా పడిన తర్వాత ఈ విషయాన్ని అతనితో జట్టు మేనేజ్మెంట్ వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఆ ఒత్తిడి వల్ల లక్నో జట్టు తో తలపడిన మ్యాచ్ లో గుజరాత్ సారధి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 35 రన్స్ స్కోర్ చేసినప్పటికీ.. లక్నో జట్టు విధించిన టార్గెట్ ఫినిష్ చేయడంలో విఫలమయ్యాడు. జట్టుకూర్పు లో కూడా అంతగా కొత్తదనాన్ని చూపించలేకపోయాడు.
ఇక టాప్ -2 లోకి వెళ్లాల్సిన తరుణంలో.. ధోని సేనపై కచ్చితంగా గెలవాల్సిన సందర్భంలో..గిల్ సేన వెన్ను చూపించింది. సొంత మైదానంలో దారుణంగా 83 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమిని ఎవరూ ఊహించలేదు. చివరికి గిల్ సేనపై గెలుస్తామని ధోని కూడా అనుకోని ఉండడు. అయితే బ్యాటింగ్లో విఫలమైన గిల్ బృందం.. బౌలింగ్లో దారుణంగా చేతులెత్తేసింది.. పటిష్టమైన బంతులను వేయాల్సిన సందర్భంలో.. ధారాళంగా పరుగులు ఇచ్చింది.. అయితే ఈ రెండు మ్యాచ్లు ఓడిపోవడం ఒకరకంగా గిల్ కు ఇబ్బందికరమేనని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ” కెప్టెన్ అయిన తర్వాత గిల్ మైదానంలో అంత ఉత్సాహంగా కనిపించలేదు. అలాగని ఈ ఒక్క మ్యాచ్ ను అతడి నాయకత్వానికి గీటు రాయి అని చెప్పలేం. ఏం జరుగుతుందో తెలియదు. కాకపోతే ఇప్పటికైతే గిల్ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో గిల్ అంత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేదు.. ఫోర్, సిక్సర్ కొట్టి సౌకర్యవంతంగా కనిపించినప్పటికీ.. దానిని భారీ స్కోర్ లాగా మలచలేకపోయాడు. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి అన్షుల్ కాంబోజ్ బౌలింగ్ లో వెను తిరిగాడు. గిల్ అవుట్ అయిన వెంటనే.. మిగతా ప్లేయర్లు కూడా డ్రెస్సింగ్ రూమ్ వైపు క్యూ కట్టారు.