MS Dhoni : గుజరాత్ తో తలపడిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తాత్కాలిక సారథి ధోని తొలిసారిగా నోరు విప్పాడు. ఈ మ్యాచ్లో ధోని సేన విజయం సాధించింది. విజయం అనంతరం ధోని తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. “ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఆడారు. మీ రిటర్మెంట్ కు సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. దీనిపై మీరేం చెబుతారని” వ్యాఖ్యాత ప్రశ్నించగా.. ధోని తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. రిటర్మెంట్ కి సంబంధించి నేరుగా వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ.. దాదాపు తన రిటర్మెంట్ పై వస్తున్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పాడు. “నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం.. నా సొంత రాష్ట్రంలో ఝార్ఖండ్ అంటే ఇంకా చాలా ఇష్టం. నా వద్ద అద్భుతమైన బైక్ కలెక్షన్ ఉంది. కచ్చితంగా సొంత రాష్ట్రం వెళతాను. ఇష్టమైన బైక్ రైడింగ్ ను ఆస్వాదిస్తాను. రిటైర్మెంట్ పై ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇంతకుముందు నేను క్లారిటీ ఇచ్చాను. ఇకపై ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే నా రిటైర్మెంట్ దాయడానికి రహస్యం కాదు. అది కచ్చితంగా ప్రేక్షకులకు తెలుస్తుంది. అభిమానులకు తెలియకుండా ఉండదు కదా” అంటూ ధోని చమత్కరించాడు.
Also Read : బ్యాటింగ్ కు రాలేదు.. మైదానంలో ఉత్సాహంగా లేడు.. ధోనికిదే చివరి ఐపిఎల్?!
దానిపై నాకు కంగారు లేదు
రిటైర్మెంట్ కి సంబంధించిన విషయంలో నాకు ఎటువంటి కంగారు లేదు. దానికి ఇంకా నాలుగు నుంచి ఐదు నెలల సమయం ఉంది. వచ్చే రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాను. ప్రదర్శన ఆధారంగానే ఆటగాళ్లు రిటైర్ అవ్వాలంటే.. ప్రతి ప్లేయర్ 22 సంవత్సరాలకే రిటైర్మెంట్ ప్రకటించాలి. వచ్చే సీజన్ కు నేను తిరిగి వస్తానని చెప్పలేను. అలాగని రానని కూడా చెప్పలేను. దాని గురించి నిర్ణయం తీసుకోవడానికి నాకు చాలా సమయం ఉంది. ఈ లోగా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆస్వాదించాల్సిన సందర్భాలు అలాగే ఉండిపోయాయి. ఇష్టమైన ద్విచక్ర వాహనాల మీద ఝార్ఖండ్ వీధులలో తిరగాలి. ఆ ప్రయాణాలను ఆస్వాదించాలి. ఒకవేళ నా రిటర్మెంట్ కు సంబంధించి ఏదైనా విషయాలు చెప్పాలి అంటే.. కచ్చితంగా చెప్పేస్తాను. అంత తప్ప అందరూ దాచుకోవడానికి ఏమీ ఉండదు. గతంలో నా రిటైర్మెంట్ విషయాలను నేరుగా చెప్పేశాను. ఎందులోనూ గోప్యత పాటించలేదు. ఒకవేళ రిటర్మెంట్ ప్రకటించాలి అని నేను అనుకుంటే కచ్చితంగా దానిని చెప్పేస్తానని” ధోని వ్యాఖ్యానించాడు.
మొత్తంగా కొద్దిరోజులుగా తన రిటైర్మెంట్ కి సంబంధించి వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చాడు ధోని. ఈ ప్రకారం ధోని వచ్చే సీజన్ కూడా ఆడతాడని అతని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అతడు వచ్చే సీజన్ లో ఒక్క మ్యాచ్ ఆడి.. రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
MS DHONI IS NOT RETIRING
Dhoni responded to questions about his retirement. He also gave a tight slap — indirectly — to those asking him to retire
See you next year – The Man, The Myth, The Legend Thala #CSKvsGT #GTvsCSK #MSDhoni pic.twitter.com/3CoHIJHvwE
— Amit (@AMITZZZ_) May 25, 2025