Asia Cup 2023: ఆసియా కప్ ప్రారంభానికి ముందే టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. చాలా కాలం తర్వాత ఆసియా కప్‌కు ఎంపికైన స్టార్ ఆటగాడు కేఎల్.రాహుల్ తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో పాకిస్థాన్, నేపాల్‌తో ఆడే మ్యాచ్‌లకు కేఎల్. రాహుల్ దూరం కానున్నాడు. అతడి స్థానంలో టీమిండియా ఎవరికి చోటు ఇస్తుందో అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆగస్టు 30 నుంచి సిరీస్..
ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. టీమిండియా తన తొలి రెండు మ్యాచ్‌లను పాకిస్థాన్, నేపాల్ జట్లతో ఆడనుంది. అయితే చాలా కాలం తర్వాత ఆసియా కప్‌కు ఎంపికైన స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. సెప్టెంబర్ 2న జరిగే భారత్–పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫైనల్ ఎలెవన్∙ఎలా ఉంటుందో అని పలువురు ఉత్కంఠగా గమనిస్తున్నారు. రోహిత్, గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగితే కేఎల్.రాహుల్ మిడిలార్డర్‌లో దిగుతాడని అందరూ అంచనా వేశారు. వికెట్ కీపర్‌గా కూడా అతడే సేవలు అందిస్తాడని ఊహించారు.
కానీ అనూహ్యంగా తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ప్రకటించడంతో ఇప్పుడు అతడి స్థానంలో సంజు శాంసన్‌కు అవకాశం ఇస్తారా లేక ఇషాన్ కిషన్‌ను తీసుకుంటారా అన్నది సస్పెన్స్‌గా మారింది. సీనియర్ ఆటగాడు దూరం కావడం భారత్‌ను దెబ్బతీస్తుందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే రాహుల్ ఎందుకు దూరమువతాడని మాత్రం ఇటీ ద్రవిడ్, అటు బీసీసీఐ ప్రకటించలేదు.