https://oktelugu.com/

Neeraj Chopra: భారత్ ను వదిలి దక్షిణాఫ్రికాకు.. సంచలన నిర్ణయంతో షాక్ ఇచ్చిన స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా..

ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో భారత దేశానికి స్వర్ణం, రజతం అందించి సరికొత్త చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవలి ఒలింపిక్స్ లో రజతం సాధించిన అతడు.. వచ్చే పోటీలలో స్వర్ణమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. ఈక్రమంలో తన ఆట తీరును మార్చుకోవడానికి ఏకంగా సరికొత్త ప్రణాళిక రూపొందించాడు..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 10, 2024 / 12:11 PM IST

    Neeraj Chopra

    Follow us on

    Neeraj Chopra: జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జావెలిన్ త్రో లో ఏకంగా ఒలింపిక్స్ లో స్వర్ణం, రజతం సాధించిన ఘనత అతడి సొంతం. అయితే గత కొంతకాలంగా నీరజ్ చోప్రా గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. దానికి తగ్గట్టుగా శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ.. మునుపటిలాగా సత్తా చాట లేకపోతున్నాడు. ఇటీవల టోర్నీలలో స్వర్ణానికి బదులుగా రజతం సాధించడం అతడి స్థాయిని కాస్త తగ్గించింది. దీంతో మరింత మెరుగ్గా రాణించాలని అతడు భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే మెరుగైన సాధన చేస్తున్నాడు. తన సాధనకు తగ్గట్టుగా కోచ్ ఉండాలని భావించి.. సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో ప్రముఖ జావెలిన్ త్రో లెజెండ్ జెలెజ్నీ ని నీరజ్ కోచ్ గా నియమించుకున్నాడు.. ఇకపై నీరజ్ జెలెజ్నీ వద్ద శిక్షణ తీసుకుంటాడు. గడచిన ఐదు సంవత్సరాలుగా నిరుద్యోగులకు క్లాస్ బార్టోనీజ్ శిక్షణ ఇచ్చాడు. అయితే అతడు కుటుంబ కాలనాల వల్ల ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. బార్టోనీజ్ వెళ్లిపోవడంతో నీరజ్ చోప్రా కన్నీటి పర్యంతమయ్యాడు. ” నేను గాయపడిన సందర్భాల్లో అండగా ఉన్నారు. నేను గెలిచినప్పుడు భుజం తట్టారు. ఓడిపోయినప్పుడు ధైర్యం చెప్పారు. అలాంటి వ్యక్తి కోచ్ బాధ్యతల నుంచి వెళ్లిపోవడం బాధాకరమని” అప్పట్లో నీరజ్ వ్యాఖ్యానించాడు. బార్టో నీజ్ శిక్షణలో నీరజ్ ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం, పారిస్ ఒలింపిక్స్ లో రజతం దక్కించుకున్నాడు. అయితే ఇటీవల డైమండ్ లింక్ ఫైనల్ లో వెంట్రుక వాసిలో స్వర్ణాన్ని నీరజ్ కోల్పోయాడు.

    నీరజ్ ఉత్సుకత

    బెలెజ్నీ శిక్షణలో నీరజ్ అత్యంత ఉత్సుకతతో కనిపిస్తున్నాడు. “ఉత్తేజిత వాతావరణం నా ముందు ఉంది. కచ్చితంగా నేను కొత్త చాప్టర్ ప్రారంభిస్తున్నాను. మెరుగైన సాధన కోసం ఆసక్తిగా ఉన్నానని” నీరజ్ వ్యాఖ్యానించాడు. అయితే అత్యంత అధునాతనమైన సాధన కోసం నీరజ్ ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికా వెళ్తున్నాడు. వచ్చే ఏడాది జరిగే పోటీల కోసం దక్షిణాఫ్రికాలోని పాచి ఫస్ట్రో మ్ ప్రాంతంలో ట్రైనింగ్ తీసుకోనన్నాడు. గతంలో పారిస్, టోక్యో ఒలంపిక్స్ కోసం అతడు ఈ ప్రాంతంలోనే శిక్షణ తీసుకున్నాడు. అయితే ఈసారి ఎలాగైనా స్వర్ణం సాధించాలని అతడు భావిస్తున్నాడు డైమండ్ లీక్ లోను సత్తా చాటాలని యోచిస్తున్నాడు. అందువల్లే ఇలాంటి మార్పులకు శ్రీకారం చుట్టానని అతడు వివరిస్తున్నాడు. అయితే నీరజ్ ఈసారి కచ్చితంగా స్వర్ణం సాధిస్తాడని అతని అభిమానులు అంచనా వేస్తున్నారు.