https://oktelugu.com/

AP Rains : ఏపీకి తీవ్ర హెచ్చరిక.. ఆ జిల్లాల ప్రజలకు హైఅలెర్ట్

బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఉత్తర దిశగా కొనసాగుతూ.. దిశ మార్చుకుంటూ పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లనుంది. ఈ తరుణంలో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది.

Written By:
  • Dharma
  • , Updated On : November 29, 2024 / 08:56 AM IST

    Heavy Rains Alert in AP

    Follow us on

    AP Rains :  ఏపీకి భారీ వర్ష సూచన. తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం వరకు ఉత్తర దిశగా ఇలాగే కొనసాగనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అనంతరం వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రం నాటికి బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. అటు తరువాత అదే దిశలో కదులుతూ నవంబర్ 30న ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి మధ్య తీరం దాటవచ్చు. దీని ప్రభావంతో ఏపీలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్ర శనివారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ప్రధానంగా దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమ జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుంది. శుక్రవారం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదే సమయంలో చిత్తూరు, కడప, సత్యసాయి జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    * చలి ఆపై చల్లటి గాలులు
    రాష్ట్రవ్యాప్తంగా తుఫాను ప్రభావం అధికంగా ఉంది.చలికి తోడు చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆకాశం మేఘవృత్తం అయి పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయాయి. చలికి తోడు చల్లటి గాలులు వీస్తుండడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు.ఉదయం 8 గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి.మబ్బులు కొమ్ముకోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.మరోవైపు తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం లేదు. కోస్తాంధ్రలోని తీర ప్రాంతంలో ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది ప్రభుత్వం.

    * రైతుల అప్రమత్తం
    అయితే రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ముమ్మురంగా సాగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే భారీ వర్ష హెచ్చరికతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రైతులకు సూచించింది. పొలాల్లో ఉండే వరి, ధాన్యాన్ని సంరక్షించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. వర్షాల దృష్ట్యా వరి కోతలు నిలిపివేయాలని.. వర్షం తెరిపినిచ్చాక వరి కోతలు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు అధికారులు.