SL : టి20 వరల్డ్ కప్ పై ఆశలు పెంచుకున్న జట్లలో శ్రీలంక కూడా ఒకటి. కానీ ఈసారి కూడా ఆ జట్టు ఆశలు నెరవేరలేదు. కీలక మ్యాచ్లో ఓడిపోవడం.. గెలవాల్సిన మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించడంతో టి20 వరల్డ్ కప్ లో శ్రీలంక కథ ముగిసింది. దీంతో ఆ జట్టు ఇంటిదారి పట్టింది. గ్రూప్ – డీ లో శ్రీలంక జట్టు కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన మొదటి రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. నేపాల్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్లో విజయం సాధించి, సూపర్ -8 కు వెళ్లాలనుకున్న శ్రీలంక ఆశలు నీరు కారిపోయాయి. ఫ్లోరిడాలో బుధవారం జరగాల్సిన ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. చివరికి 5 ఓవర్ల ఆటైనా కొనసాగించాలని భావిస్తే.. అది కూడా సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ఎంపైర్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో గ్రూప్ – డీ లో మూడు విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా 6 పాయింట్ల సహాయంతో సూపర్ -8 కు చేరుకుంది.
ఇక గ్రూప్ – బీ లో సూపర్ -8 కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. అంటిగ్వా వేదికగా నమిబియా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్ -8 కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి చేదించింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 6 పాయింట్లతో సూపర్ -8 కు చేరుకుంది. ఈ గ్రూపులో నమీబియా మూడు మ్యాచ్లు ఆడి, (ఒక విజయం), ఒమన్(మూడు మ్యాచ్లు మూడు ఓటములు) తో లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది.. ఈ గ్రూప్ నుంచి స్కాట్లాండ్ సూపర్ -8 కు చేరుకునే అవకాశం ఉంది.. ఇక ప్రస్తుతం ఆ జట్టు మూడు మ్యాచ్ లు ఆడి, ఐదు పాయింట్లతో కొనసాగుతోంది.
ఇక గ్రూప్ – బీ లో డిపెండింగ్ ఛాంపియన్ గా ఉన్న ఇంగ్లాండ్.. ఈసారి టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్లలో ఇంగ్లీష్ ఒకదాంట్లో ఓటమిపాలైంది, మరొక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఇంగ్లాండ్ జట్టు సూపర్ -8 కు చేరాలంటే తప్పకుండా మిగిలిన రెండు మ్యాచ్లలో (ఒమన్, నమిబియా) భారీ పరుగుల తేడాతో గెలవాలి. దాంతోపాటు స్కాట్లాండ్ తన చివరి మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవాలి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More