Sri Lanka Vs Afghanistan Asia Cup 2025: ఆఫ్గనిస్తాన్ జట్టు క్రికెట్లో ఒక సంచలనం. అతి సాధారణ ఆటగాళ్లతో అసాధారణ ఫలితాలను ఆ జట్టు అందుకున్నది. అంతటి ఆస్ట్రేలియాను కూడా ఓడించింది.. ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించింది. న్యూజిలాండ్ జట్టుకు భయం అంటే ఏంటో పరిచయం చేసింది. భారత్ మినహా క్రికెట్ ఆడే అన్ని జట్లకు ఏదో ఒక రూపంలో ఆఫ్గనిస్తాన్ షాక్ ఇచ్చింది. ప్రస్తుత ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ అదరగొడుతుందని అందరూ అనుకున్నారు. కానీ.. ఆఫ్గనిస్తాన్ ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. లీగ్ దశలో మూడు మ్యాచ్ల్లో రెండిట్లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. హాంకాంగ్ మీద గెలిచినప్పటికీ, బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడిపోయి అభిమానుల ఆశలను అడియాసలు చేసింది.
Also Read: ‘ఓజీ’ లో ప్రకాష్ రాజ్ కి ఇలాంటి క్యారక్టర్ ఇచ్చారా..? పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా!
కొంతకాలంగా బంగ్లాదేశ్ మెరుగైన క్రికెట్ ఆడుతోంది. మేటి మేటి జట్లను సైతం ఓడగొడుతోంది. కానీ ఆసియా కప్ కు వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ తేలిపోయింది. బ్యాటింగ్లో విఫలమైంది. బౌలింగ్ లో చేతులెత్తేసింది. ఫీల్డింగ్ లో తలవంచింది. మొత్తంగా తన మీద ఉన్న అంచనాలను మొత్తం తలకిందులు చేసుకుంది. తద్వారా అత్యంత అనామకంగా ఆసియా కప్ నుంచి పక్కకు తప్పుకుంది. శ్రీలంక చేతిలో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. గురువారం జరిగిన మ్యాచ్లో శ్రీలంక చేతిలో ఆఫ్ఘనిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ముందుగా బ్యాటింగ్ ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ టీ స్థాయిలో స్కోరు చేయడానికి ప్రధాన కారణం నబి. ఎందుకంటే ఆ జట్టులో ప్రధాన బ్యాటర్లు మొత్తం విఫలమయ్యారు. కనీసం శ్రీలంక బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు. నబి ఏకంగా 22 బంతుల్లో 60 పరుగులు చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ముఖ్యంగా వెల్లలగే వేసిన 20 ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టాడు. తొలి మూడు బంతులకు మూడు సిక్సర్లు కొట్టిన అతడు.. తర్వాత బంతి నో బాల్ కావడంతో ఊరుకున్నాడు. ఆ తదుపరి 4, 5 బంతులను కూడా సిక్సర్లు కొట్టాడు. చివరి బంతికి క్విక్ డబుల్ తీయబోయి రన్ అవుట్ అయ్యాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 32 పరుగులు వచ్చాయి. 22 బంతులు ఎదుర్కొన్న నబి 60 పరుగులు చేయడంతో ఆఫ్గనిస్తాన్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. 170 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు 18.4 ఫినిష్ చేసింది. ఓపెనర్ కుశాల్ మేండిస్ చివరి వరకు నిలబడ్డాడు. 52 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోన్ కొట్టు తన స్టామినా నిరూపించుకున్నాడు. అతడికి కుషాల్ పెరీరా, కామిందు మెండిస్ సహకరించారు. ఇక ఈ మ్యాచ్లో గెలుపొందడం ద్వారా శ్రీలంక సూపర్ 4 లోకి వెళ్లిపోయింది. ఇక ప్రస్తుత ఆసియా కప్ లో శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్ సూపర్ 4 లోకి వెళ్లిపోయాయి.