Bigg Boss 9 Telugu TRP Rating: ఈసారి చదరంగం కాదు రణరంగం.. బిగ్ బాస్ ప్రారంభంలో నాగార్జున మాట్లాడిన మాటలు. దానికి తగ్గట్టుగానే ఈసారి సామాన్యులకు పెద్దపీట అంటూ ప్రచారం చేసుకున్నారు. కొంతమందిని ఎంపిక చేసి వారితో నెత్తి మాసిన పనులు చేయించి.. అందరిలో కొందరిని ఎంపిక చేసి బిగ్ బాస్ లోకి తీసుకున్నారు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే థీమ్ తో మొదలుపెట్టిన బిగ్ బాస్ మీద భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. రెండు హౌస్ లు కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. కానీ రియాల్టీ మాత్రం అలా లేదు.
Also Read: ‘ఓజీ’ లో ప్రకాష్ రాజ్ కి ఇలాంటి క్యారక్టర్ ఇచ్చారా..? పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా!
ఇంత ప్రచారం చేశారు కాబట్టి.. ఈ స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టారు కాబట్టి బిగ్ బాస్ అంచనాలు అందుకుంటుందని.. సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని.. అంచనాలు పెరిగిపోయాయి. కానీ వాస్తవం మాత్రం అలా లేదు. ఎందుకంటే బిగ్ బాస్ ను పెద్దగా ఎవరూ చూడటం లేదు. ఇదేదో మేము చేస్తున్న ఆరోపణ కాదు. ఎందుకంటే టీవీలలో ప్రసారమవుతున్న రియాల్టీ షోలకు టిఆర్పి రేటింగ్స్ ప్రధానం.. ఈ ప్రకారం చూసుకుంటే ఇటీవల బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ ను స్టార్ మా ఘనంగా ప్రసార చేసింది. విపరీతమైన హైప్ ఇచ్చింది. కానీ వాస్తవంలో ఆ స్థాయిలో రేటింగ్స్ రాలేదు.. అర్బన్ ఏరియాలో 11.37.. అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలలో కలిపి 9.7 రేటింగ్స్ వచ్చినట్టు తెలుస్తోంది. అర్బన్ ఏరియాలో 11.37 అంటే పెద్ద రేటింగ్స్ కానేకావు. ఇప్పటికి కార్తీకదీపం సీరియల్ అంతకుమించి రేటింగ్స్ నమోదు చేస్తోంది. సాగదీత ఉన్నప్పటికీ.. నవ్యత లేకపోయినప్పటికీ కార్తీక దీపానికి ఆదరణ లభిస్తోంది. అంతటి నాగార్జున ఉన్నా.. చదరంగం కాదు రణరంగం అని చెప్పుకున్నా బిగ్ బాస్ ఆశించిన ఆదరణ సొంతం చేసుకోవడం లేదు.
వాస్తవానికి బిగ్ బాస్ గతంలో ఎన్నడు కూడా గొప్ప గొప్ప రేటింగ్స్ సాధించలేదు. ఏదో హైప్ మీద స్టార్ మా దీనిని కొనసాగిస్తోంది.. కార్పొరేట్ కంపెనీల యాడ్స్, ఎండార్స్ మెంట్స్.. ఇతర వాటితో మాయ చేస్తోంది. వాస్తవానికి టీఆర్పి రేటింగ్స్ అనేదే పెద్ద దందా అయినప్పటికీ.. అందులో కూడా బిగ్ బాస్ నెగ్గుకు రాలేకపోతోంది అంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లాచింగ్ ఎపిసోడ్ కే ఇలాంటి రేటింగ్స్ ఉంటే.. ఇక వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి.