Bigg Boss 9 Telugu Ritu Chaudhary: ఈ వారం బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో రీతూ చౌదరి(Ritu Chowdary), డిమోన్ పవన్ మధ్య జరిగిన లవ్ ట్రాక్ ఎలాంటిదో మనమంతా కళ్లారా చూసాము. చూస్తుంటే వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ నడవడం కాదు, ఏకంగా పరుగులే తీసేలా ఉంది. వాళ్ళ మధ్య జరిగే లవ్ ట్రాక్ ని మొన్నటి ఎపిసోడ్ లో సగం పైగా చూపించారు. వీళ్ళ సోది లవ్ స్టోరీ ని ఇంత సేపు చూపించడం అవసరమా అని అనిపించింది. కానీ అలా చూపించడానికి అసలు కారణం ఇదా అని నిన్నటి ఎపిసోడ్ ని చూస్తే తెలిసొచ్చింది. నిన్న కెప్టెన్సీ టాస్క్ లో చివరి లెవెల్ గా ‘రంగు పడుద్ది’ అనే టాస్క్ ని నిర్వహించారు. ఈ టాస్క్ లో భరణి, ఇమ్మానుయేల్, మనీష్ మరియు డిమోన్ పవన్ పాల్గొన్నారు. ఈ టాస్క్ కి సంచాలక్ గా రీతూ చౌదరి వ్యవహరించింది.
Also Read: ‘ఓజీ’ లో ప్రకాష్ రాజ్ కి ఇలాంటి క్యారక్టర్ ఇచ్చారా..? పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా!
ఈమెకు గత వారం మంచి ఎపిసోడ్స్ పడింది. నామినేషన్స్ ఎపిసోడ్ కూడా ఈమెకు బాగా కలిసొచ్చింది. కానీ నిన్న ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణం గా ఆమె గ్రాఫ్ మొత్తం పాతాళం లోకి పడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ దెబ్బతో ఆమె ఎక్కువ రోజులు హౌస్ లో కొనసాగడం కష్టమే. మొన్న జరిగిన లవ్ ట్రాక్ లో డిమోన్ పవన్ కి చెప్తుంది ‘నువ్వు కచ్చితంగా ఈ వారం కెప్టెన్ అవ్వాలి’ అని. చెప్పినట్టుగానే తన ప్రియుడ్ని కెప్టెన్ అయ్యేలా చేసుకుంది. వాస్తవానికి లెక్క ప్రకారం ఈ టాస్క్ లో భరణి గెలవాలి. కానీ రెండవ రౌండ్ లో రీతూ చౌదరి తానూ ఆపండి ఆపండి అని మూడు సార్లు అరిచినా భరణి ఆగలేదని అతన్ని గేమ్ నుండి తొలగించింది. బజర్ మోగే వరకు గేమ్ ని ఆపకూడదు అనే రూల్ ఉంది. కానీ భరణి విషయం లో ఈమె ఆ రూల్ ని అనుసరించలేదు.
అవతల ఓనర్స్ మొత్తం కావాలని కామనర్స్ వెర్సస్ సెలబ్రిటీస్ అంటూ అరవడం మొదలు పెట్టారు. దీనిని గమనించిన రీతూ చౌదరి, ఎక్కడ తనని బయాస్ అని అనుకుంటారేమో అని భయపడి, భరణి ని ఆ గేమ్ నుండి తొలగించిందా?, లేకపోతే తన ప్రియుడు డిమోన్ పవన్ కోసం తొలగించిందా అనేది చూడాలి. ఇదే రేంజ్ తప్పులు డిమోన్ పవన్ చాలానే చేసాడు, ఇమ్మానుయేల్ కూడా పొరపాటు పడ్డాడు. కానీ ఏ తప్పు చేయని భరణి మాత్రం ఎలిమినేట్ అయ్యాడు. ఇదెక్కడి న్యాయం?, దీనిని ఈ వారం నాగార్జున గుర్తిస్తాడా?, లేదా? అనేది చూడాలి. పాపం భరణి పరిస్థితి మాత్రం హౌస్ లో రోజు రోజుకు దయనీయంగా మారింది. టెనెంట్ గా ఉన్నప్పుడు తన వాళ్ళతో కలిసి సంతోషంగా ఉండేవాడు, ఓనర్ అయ్యాక నరకం అనుభవిస్తున్నాడు అనే చెప్పాలి.