WTC Finals 2025 : నిన్నటి దాకా వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా..మెల్ బోర్న్ టెస్టులో గెలిచి.. WTC ఫైనల్స్ వెళ్లే అవకాశాలను మరింత బలోపేతం చేసుకుంది. టీమిండియా మూడవ ర్యాంకుకు పడిపోయింది. ఈ క్రమంలో టీమిండియా కు WTC ఫైనల్స్ వెళ్లే అవకాశాలు లేవా అంటే? ఉన్నాయి. కాకపోతే అది జరగాలంటే అద్భుతాలు చోటు చేసుకోవాలి. మరి కొద్ది రోజుల్లో సిడ్నీ వేదికగా టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్ట్ ఆడనుంది. ఈ టెస్టులో టీమిండియా కచ్చితంగా గెలవాలి. అంతేకాదు ఆస్ట్రేలియాపై శ్రీలంక 1-0 లేదా 2-0 లతో గెలవాలి. అప్పుడు విన్నింగ్ పర్సంటేజ్ ఆధారంగా భారత్ WTC ఫైనల్స్ వెళ్తుంది. ఒకవేళ సిడ్ని టెస్ట్ కూడా పడిపోతే టీమ్ ఇండియాకు దారుల మొత్తం మూసుకుపోతాయి. ఒకవేళ సిడ్నీ టెస్టులో భారత్ గెలిచినా.. శ్రీలంక – ఆస్ట్రేలియా సిరీస్ డ్రా గా ముగిస్తే.. భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అవకాశం ఉండదు.. ఒకవేళ భారత్ సిడ్నీ టెస్టులో ఓడిపోయినా, డ్రా చేసుకున్నా ఫైనల్ వెళ్లడానికి చాన్స్ ఉండదు.
ఆ సిరీస్ ఓడిపోకుండా ఉంటే..
టీమిండియా బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ వరకు.. టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. కానీ ఎప్పుడైతే స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో ఓటమిపాలైందో.. అప్పటినుంచి ఆట తీరు పూర్తిగా మారిపోయింది. వైట్ బాల్ ఫార్మాట్ లో అదరగొడుతున్న ఆటగాళ్లు.. టెస్ట్ వరకు వచ్చేసరికి తేలిపోతున్నారు. పెర్త్ టెస్టులో 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా పై గెలిచిన టీమిండియా.. అడిలైడ్, మెల్ బోర్న్ టెస్టులలో దారుణమైన ఓటమిపాలైంది. బ్రిస్ బేన్ టెస్టు వర్షం వల్ల మ్యాచ్ డ్రా అయింది. ఒకవేళ వర్షం కనుక కురువకపై ఉంటే అడిలైడ్ ఫలితమే అక్కడ కూడా వచ్చేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫఫామ్ లేమి జట్టు విజయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు టెస్టులలో రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ.. అతడు తన బ్యాటింగ్ స్టైల్ మార్చుకోవడం లేదు. పైగా మరింత దారుణంగా ఆడుతున్నాడు. ఇక విరాట్ కూడా పెర్త్ టెస్టు మినహా.. అన్నింటిలోనూ విఫలమయ్యాడు. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఒకటి కూడా ఆటం లేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రమే ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తున్నాడు. మెల్ బోర్న్ టెస్టులో తొలి, తుది ఇన్నింగ్స్ లలో అతడు ఏకంగా 82, 84 పరుగులు చేసి జట్టు పరువును కాస్తలో కాస్త కాపాడాడు.