https://oktelugu.com/

Sandhya Theater stampede  Case : సంధ్య థియేటర్ ఘటనలో బయటపడ్డ సంచలన వాస్తవాలు..అల్లు అర్జున్ ఎదుగుదలని తట్టుకోలేక వాళ్ళే ఈ కుట్ర చేసారా?

చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రమాదం జరిగి చనిపోయినప్పుడే స్పందించి, వాళ్లకు ఆర్ధికసాయం అందించేంత గొప్ప మనసు ఉన్న అల్లు అర్జున్, తన సొంత అభిమాని చనిపోతే ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు..?, జరిగిన ఘటన గురించి అల్లు అర్జున్ కి తెలుసు, అయినప్పటికీ కూడా ఆయన థియేటర్ నుండి కదలలేదు అంటూ ఒక వాదన వినిపించారు. అది కచ్చితంగా కాదు అనడానికి కొన్ని వాస్తవాలను చూద్దాం.

Written By:
  • Vicky
  • , Updated On : December 30, 2024 / 10:20 PM IST

    Allu Arjun

    Follow us on

    Sandhya Theater stampede  Case :  సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగి 26 రోజులు పూర్తి అయ్యింది. దురదృష్టకరమైన ఈ సంఘటన ఈ 26 రోజుల్లో ఎన్ని రాజకీయ రంగులను పులుముకుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. జరిగిన ఘటన మొత్తానికి కేవలం అల్లు అర్జునే కారణం, అతని కారణంగానే నిండు ప్రాణం బలి అయ్యింది అంటూ అతన్ని విలన్ గా చేసి చూపించే ప్రయత్నాలు చాలానే జరిగాయి. కానీ అల్లు అర్జున్ ని జనాలు 22 ఏళ్ళ నుండి చూస్తున్నారు..చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రమాదం జరిగి చనిపోయినప్పుడే స్పందించి, వాళ్లకు ఆర్ధికసాయం అందించేంత గొప్ప మనసు ఉన్న అల్లు అర్జున్, తన సొంత అభిమాని చనిపోతే ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు..?, జరిగిన ఘటన గురించి అల్లు అర్జున్ కి తెలుసు, అయినప్పటికీ కూడా ఆయన థియేటర్ నుండి కదలలేదు అంటూ ఒక వాదన వినిపించారు. అది కచ్చితంగా కాదు అనడానికి కొన్ని వాస్తవాలను చూద్దాం.

    సంధ్య థియేటర్ కెపాసిటీ 1300 సీట్లు..అప్పర్ బాల్కనీ, లోయర్ బాల్కనీ గా ఈ థియేటర్ నిర్మాణం జరిగింది. అల్లు అర్జున్ సినిమా చూసింది అప్పర్ బాల్కనీలో. అది కూడా ఆయన ప్రొజెక్టర్ కి దగ్గరగా ఉన్న సీట్స్ వద్ద కూర్చున్నాడు. రేవతి గారు అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయింది లోయర్ బాల్కనీ లో. ఎక్కడో అప్పర్ బాల్కనీ లో ప్రొజెక్టర్ కి దగ్గరగా కూర్చున్న అల్లు అర్జున్ కి కేవలం స్క్రీన్ తప్ప, లోయర్ బాల్కనీ లో ఏమి జరుగుతుంది అనేది తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్న అల్లు అర్జున్ కి రేవతి గారు చనిపోయింది అనే విషయం తెలియదు. ఒకవేళ ఆయన స్టాఫ్ కి తెలిసినప్పటికీ కూడా, ఆ హంగామాలో అల్లు అర్జున్ కి విషయం తెలియచేయడం అంత సులువు కాదు. పోలీసులు అల్లు అర్జున్ ని థియేటర్ లోపల నుండి తీసుకొచ్చిన వీడియోలు పోలీసులు బయటపెట్టారు కానీ, రేవతి చనిపోయింది అనే విషయం అల్లు అర్జున్ కి చెప్పినట్టు ఆధారాలు లేవు.

    ఆయన టీం వరకు ఈ విషయాన్నీ చేర్చి ఉండొచ్చు కానీ, అది అల్లు అర్జున్ దాకా వెళ్ళలేదు, ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ జరిగింది అనేది ఈ ఘటనని పూర్తిగా పరిశీలించిన వాళ్లకు అర్థం అయ్యింది. అంతే కాకుండా అల్లు అర్జున్ మెయిన్ గేట్ నుండి రావడం వల్ల తొక్కిసిలాట జరిగింది అంటూ మరో ఫేక్ ప్రచారం చేసారు కొంతమంది నెటిజెన్స్. అందులో కూడా ఎలాంటి నిజం లేదు. సంధ్య థియేటర్ లోపలకు వెళ్లేందుకు రెండు గేట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ లోపలకు వెళ్ళింది రెండవ గేట్ నుండి. దానికి స్పష్టమైన ఆధారాలు వీడియోల రూపం లో ఉన్నాయి. ఈ ఉదంతం మొత్తం పరిశీలించి చూస్తుంటే కొంతమంది పనిగట్టుకొని అల్లు అర్జున్ ఎదుగుదల ని తట్టుకోలేక, అతని పై పదే పదే కథనాలు ప్రచురించి, జనాల్లో నెగటివ్ చెయ్యాలని చూసినట్టు అర్థం అవుతుంది.

    మన తెలుగు జాతి స్థాయిని పెంచిన వారిలో అల్లు అర్జున్ ఒకరు. ఎంతోమంది మహానటులు ఉన్నప్పటికీ కూడా, కేవలం తెలుగు లో అల్లు అర్జున్ కి మాత్రమే ఉత్తమ నటుడి క్యాటగిరీలో నేషనల్ అవార్డు వచ్చింది. నేడు పుష్ప 2 వసూళ్ల విషయం లో కొత్త బెంచ్ మార్క్ ని ఏర్పాటు చేసి దేశం లోనే నెంబర్ 1 గ్రాసర్ గా నిల్చింది. ఏ బాలీవుడ్ అయితే మన తెలుగు సినిమాని, తెలుగు ఆడియన్స్ ని, తెలుగు నటీనటుల్ని చిన్న చూపు చూస్తూ అవమానించారో, అదే బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టి తెలుగోడి సత్తా మరోసారి చాటి చెప్పిన వ్యక్తి అల్లు అర్జున్. అలాంటి వ్యక్తికీ ఇన్ని అవమానాలు చేయడం ఎంత వరకు కరెక్ట్. చనిపోయిన రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ రెండవ రోజే సంప్రదించింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కి అవసరమైన వైద్యాన్ని అందించేందుకు అల్లు అర్జున్ టీం పూర్తిగా సహకరించింది. ఈ విషయాన్నీ స్వయంగా శ్రీతేజ్ తండ్రి భార్గవ్ తెలిపాడు. ఇంత కేరింగ్ గా ఉన్నది అల్లు అర్జున్ పై ఆరోపణలు చేస్తున్న వాళ్లకు తెలియదా..?, తెలిసి కూడా ఎందుకు ఇలా ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. శ్రీ తేజ్ కి సకాలం లో వైద్యం అందేలా చేయకపోతే అతను ఈరోజు ప్రాణాలతో ఉండేవాడా..? ఇవన్నీ ఎందుకు చూడడం లేదు?, ఒకవేళ అల్లు అర్జున్ రేవతి కుటుంబాన్ని పట్టించుకోకపోతే అతన్ని నిందించడం లో లాజిక్ ఉంది. కానీ అన్ని విధాలుగా సపోర్టుగా ఉంటూ కూడా అల్లు అర్జున్ ఈరోజు దోషిగా నిలబడాలా చెప్పండి? ఇదెక్కడి న్యాయం.