https://oktelugu.com/

Tollywood : డమరుకం’ లో విలన్ గా నటించిన ఇతను గుర్తు ఉన్నాడా..? ఈయన భార్య టాలీవుడ్ లో టాప్ హీరోయిన్..ఎవరో చెప్పుకోండి చూద్దాం!

అలా సినిమా మొత్తం ఇతను నెగటివ్ యాంగిల్ లో కనిపిస్తాడు కాబట్టి, ఇతన్ని కూడా విలన్ అనాల్సి వచ్చింది. అయితే ఇంతకీ ఈ గణేష్ వెంకట్రామన్ ఎవరు?, అతని భార్య సినీ హీరోయినా? ఎవరు ఆమె అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాం.

Written By:
  • Vicky
  • , Updated On : December 30, 2024 / 10:02 PM IST

    Ganesh Venkatraman

    Follow us on

    Tollywood :  అక్కినేని నాగార్జున కెరీర్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన చివరి చిత్రం ‘డమరుకం’. విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ అప్పట్లో ఒక సెన్సేషన్. అదే విధంగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన ప్రతీ పాట, ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. దీంతో ఈ చిత్రం పై అంచనాలు తారా స్థాయికి చేరింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే, ఈ సినిమా అనేక కారణాల చేత వాయిదా పడుతూ రావడంతో జనాలు ఈ చిత్రం కోసం ఇంకా ఎక్కువగా ఎదురు చూసారు. అలా 2012 వ సంవత్సరం నవంబర్ 23 వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రారంభం లో బాగా నెగటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ చాలా చీప్ క్వాలిటీ తో ఉన్నాయని కంప్లైంట్స్ వచ్చింది. కానీ అవేమి సినిమా వసూళ్లపై ప్రభావం చూపలేదు.

    ఆరోజుల్లోనే ఈ చిత్రం దాదాపుగా 30 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను సాధించి హిట్  రేంజ్ లో నిల్చింది. ఈ సినిమాకి ఇప్పటికీ కూడా విలువ తగ్గలేదు. టీవీ లో టెలికాస్ట్ చేసినప్పుడల్లా మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుంటాయి. అయితే ఈ సినిమాలో విలన్ గా సాయి కుమార్ తమ్ముడు రవి శంకర్ నటించిన సంగతి తెలిసిందే. సెకండ్ విలన్ గా గణేష్ వెంకట్రామన్ నటించాడు. వాస్తవానికి ఈయన విలన్ కాదు, విమానాశ్రయం లో వాష్ రూమ్ కి వచ్చిన ఇతని చంపి, ఇతని శరీరంలోకి వెళ్లి అనుష్క ని పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. అలా సినిమా మొత్తం ఇతను నెగటివ్ యాంగిల్ లో కనిపిస్తాడు కాబట్టి, ఇతన్ని కూడా విలన్ అనాల్సి వచ్చింది. అయితే ఇంతకీ ఈ గణేష్ వెంకట్రామన్ ఎవరు?, అతని భార్య సినీ హీరోయినా? ఎవరు ఆమె అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాం.

    గణేష్ వెంకట్రామన్ 2008 వ సంవత్సరంలో ప్రకాష్ రాజ్, త్రిష ప్రధాన పాత్ర పోషించిన ‘ఆకాశమంత’ అనే చిత్రం ద్వారా తెలుగు, తమిళం ఆడియన్స్ కి పరిచయమయ్యాడు. ఈ చిత్రం తర్వాత ఆయన కమల్ హాసన్, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈనాడు, మోహన్ లాల్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో వచ్చిన ‘కాంధర్’, ‘రంగం’ వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా పాపులర్ అయ్యాడు. అలా 20 సినిమాలకు పైగా చేసిన ఈయన, ఈ ఏడాది రత్నం, అంతిమ తీర్పు, శబరి వంటి చిత్రాల్లో నటించాడు. ఈయన భార్య నిషా కృష్ణన్ కూడా తెలుగు, తమిళ భాషల్లో, పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈమె, సీరియల్ హీరోయిన్ గా కూడా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా తమిళంలో ప్రసారమైన ‘మహాభారతం’ సీరియల్ లో ఈమె ద్రౌపది గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. తెలుగు లో ఈమె ఈటీవీ లో ప్రసారమయ్యే శ్రీమంతుడు సీరియల్ లో కూడా నటించింది. ఆమెకి సంబంధించిన ఫోటో ని ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి.

    Ganesh Venkatraman wife