SRH Vs RR (1)
SRH Vs RR: ఐపీఎల్ సీజన్–18 శనివారం(మార్చి 22న) అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిపెండెంట్ ఛాంపియన్, బెంగళూర్ రాయల్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్(Edan Gardens) మైదానంలో జరిగింది. ఇందులో బెంగళూరు రాయల్స్ ఘన విజయం సాధించింది. ఇక ఆదివారం(మార్చి 23న) సన్‌రైజర్స్ హైదరాబాద్–రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.
గత సీజన్ రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు IPL–18లో తమ ప్రయాణాన్ని ఉత్సాహంగా ప్రారంభించనుంది. ఈ రోజు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే తొలి మ్యాచ్ కోసం ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బలంగా కనిపిస్తోంది. SRH బ్యాటింగ్ లైనప్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నారు, వీరు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. గత సీజన్‌లో మూడుసార్లు 250 పరుగుల మార్కును అందుకున్న ఈ జట్టు, ఈ ఏడాది 300 పరుగుల లక్ష్యాన్ని చేరాలని భావిస్తోంది.
Also Read: అప్పటినుంచి ఎడం పెరిగిందట.. అందువల్లే విడాకులట
కోలుకున్న నితీశ్..
గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ తిరిగి జట్టులోకి రావడం SRHకి మరింత బలాన్ని చేకూర్చింది. బౌలింగ్ విభాగంలో కెప్టెన్ పాట్ కమ్మిన్స్, పేసర్ మహమ్మద్ షమీ దాడిని ముందుండి నడిపిస్తారు. స్పిన్ బాధ్యతలను ఆడమ్ జంపా సమర్థవంతంగా నిర్వహించనున్నాడు. ఈ కలయికతో ఖఏ ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ ఇలా..
ఇక రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు బలహీనంగా కనిపిస్తోంది. జోఫ్రా ఆర్చర్ తప్ప, వారి బౌలింగ్‌లో బలమైన ఆటగాళ్లు కరవైనట్లు కనిపిస్తోంది. కెప్టెన్ సంజు సామ్సన్ వేలు గాయం నుంచి కోలుకున్నప్పటికీ, అతని ఫామ్ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తుండగా, సామ్సన్ ఇంపాక్ట్ ప్లేయర్(Impact)గా ఆడే అవకాశం ఉంది. జోస్ బట్లర్ లేకపోవడం వారి బ్యాటింగ్‌ను మరింత బలహీనపరిచింది. హెట్మెయర్, ధ్రువ్ జురెల్, నితీష్ రాణా, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లపై వారు ఆధారపడాల్సి ఉంటుంది.
మొత్తానికి తొలి మ్యాచ్‌లో ఎవరు బోణీ కొడతారు అనేది ఆసక్తిగా మారింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బలమైన ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఈ ఉత్కంఠభరిత పోరును ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి!