Nidhi Agarwal
Nidhi Agarwal : మెగాస్టార్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులందరూ ఆసక్తికగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఆయన చేసిన ‘హరిహర వీరమల్లు’ సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యంగ్ రెబల్ స్టార్ గా తనదైన మార్క్ చూపిస్తున్న ప్రభాస్(Prabhas) సైతం బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాకి భారీ వసూళ్లు రావడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని తారా స్థాయికి తీసుకెళ్ళిందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే మన దర్శకులు హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ వందల కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టడానికి కూడా కారణం బాహుబలి సినిమా అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు సైతం అతనికి స్టార్ డమ్ ను తీసుకొచ్చే విధంగా ఉండటం విశేషం…
Also Read :హీరోలతో నాకు ఎదురైనా ఇబ్బందులు ఇవే : పూజ హెగ్డే
ఆయన చేస్తున్న రాజాసాబ్ (Rajasaab) సినిమా సైతం ఈ సమ్మర్ లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో ఆయన మరోసారి పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ ను చేస్తున్నాడు. తద్వారా ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రభాస్ రాజాసాబ్ సినిమాల్లో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది. మరి ఈ రెండు సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ రెండు సినిమాలు ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతుండటం వల్ల 2025వ సంవత్సరంలో ఆమె స్టార్ హీరోయిన్ గా మారబోతుంది అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఆమె తనదైన రీతిలో సత్తా చాటుకోవాలి అంటే మాత్రం ఈ రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఒకవేళ ఈ సినిమాలు కనుక తేడా కొడితే ఆమె ఫేడౌట్ దశకు చేరుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడవచ్చు. కాబట్టి ఈ రెండు సినిమాల్లో ఒక్క సినిమా సూపర్ సక్సెస్ అయినా కూడా ఆమెకు పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…
Also Read : పెళ్లి కాకుండానే తమన్నా కి ఇంత పెద్ద కూతురు ఉందా?