https://oktelugu.com/

SRH Vs RR: SRH పక్కా 300 కొడుతుంది.. కమిన్స్ ఏమన్నాడంటే..

SRH Vs RR ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs RR) రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మ్యాచ్ ఆడుతోంది. హైదరాబాదులోని ఉప్పల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచింది. బౌలింగ్ ఎంచుకుంది.

Written By: , Updated On : March 23, 2025 / 03:54 PM IST
Follow us on

SRH Vs RR: రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. హెడ్, అభిషేక్ శర్మ హైదరాబాద్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నారు. గత సీజన్లో వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా ముంబై, బెంగళూరు జట్లపై పెను విధ్వంసాన్ని సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్ చేసిన జట్టుగా హైదరాబాద్ ను నిలిపారు. ఈసారి కూడా వీరిద్దరి మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రాక్టీస్ లో కూడా వారిద్దరూ దుమ్ము రేపారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై వీరిద్దరూ భారీగా పరుగులు చేయడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు జోరుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే అత్యంత ప్రమాదకరమైన ఓపి అభిషేక్ శర్మ హైదరాబాద్ ఇన్నింగ్స్ మూడో బంతికే ఫోర్ కొట్టాడు.

Also Read: ఐపీఎల్ లో ఓల్డెస్ట్, యంగెస్ట్ ప్లేయర్లు వీరే..

300 కొడుతుందా?

ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు భారీపరుగులకు కేరాఫ్ అడ్రస్ గా ఉంది. గత సీజన్లో 300 పరుగులు చేసే విధంగా హైదరాబాద్ జట్టు కనిపించింది. అయితే గత ఏడాది ఆ రికార్డును అందుకోలేకపోయింది. అయితే ఈసారి హైదరాబాద్ జట్టు కచ్చితంగా 300 పరుగులు పడుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఆ రికార్డును బద్దలు కొడుతుందని భావిస్తున్నారు.. ఇక ఆదివారం నిర్వహించిన ఫ్యాన్స్ మీట్లో హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ తాము ఈసారి మూడు వందల పరుగులు చేస్తామని సంకేతాలు ఇచ్చాడు. ఫ్యాన్స్ మీట్ లో తన చేతికి ఉన్న మూడు వేళ్లను చూపించి 300 పరుగులు చేస్తామని.. దానికోసం ట్రై చేస్తామని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు..” గత సంవత్సరం మా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రత్యర్థి జట్ల బౌలర్ల పై ఎదురుదాడికి దిగారు. ప్రతి సందర్భంలోనూ తమను తాము నిరూపించుకున్నారు. ఫైనల్ మ్యాచ్ మినహా మిగతా అన్నింటిలో అనన్య సామాన్యం అనే ఆట తీరును ప్రదర్శించారు. ఈసారి అంతకుమించి అనేలాగా మా వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు. అద్భుతం అనే పదాన్ని మరోసారి పునరావృతం చేస్తారు. భారీ స్కోర్లు చేయడాన్ని అలవాటుగా మార్చుకుంటారని” కమిన్స్ పేర్కొన్నాడు..హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి భీకరమైన ఫామ్ లో ఉన్నారు. టి20లలో అదిరిపోయే ఇన్నింగ్స్ లు ఆడారు. వారి ఫామ్ ప్రకారం చూసుకుంటే హైదరాబాద్ జట్టు 300 స్కోర్ చేయడం పెద్ద కష్టం కాదని అభిమానులు భావిస్తున్నారు. ఉప్పల్ మైదానంలో హైదరాబాద్ ఆటగాళ్లు శివతాండవం చేస్తారని.. అందులో అనుమానం లేదని హైదరాబాద్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.